Begin typing your search above and press return to search.
బాబు ఖాకీలపై!... జగన్ డౌట్లు నిజమే!
By: Tupaki Desk | 6 Feb 2019 4:46 AM GMTటీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి పాలనలో ఏపీ పోలీస్ వ్యవస్థ ఎలా మారిపోయిందన్న విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏపీ పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావని, చంద్రబాబు చెప్పినట్టుగానే వారు వ్యహరిస్తారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న అంశం బయటకు వచ్చినా వారు సహించలేరని, మొత్తం దర్యాప్తునే తప్పుదోవ పట్టించేసి చంద్రబాబు పట్ల స్వామి భక్తిని చాటుకుంటారని... ఇలా రకరకాలుగా ఏపీ పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిక్కచ్చిగా పనిచేసే పోలీసు అధికారులకు బాబు జమానాలో కీలక పోస్టింగులు దక్కవని, బాబు జమానా ముగిసేదాకా సమర్థత ఉన్నవారంతా లూప్ లైన్ లోనే మగ్గక తప్పదని, టీడీపీ నేతలకు కొమ్ముకాసే పోలీసులకు మాత్రమే ఫోకల్ పోస్టింగులు దక్కుతాయని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే బాధ్యత కలిగిన విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీ పోలీసుల దర్యాప్తు పక్కాగా జరగదని తేల్చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఏపీ పోలీసుల చేత కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత జరిపించాలని ఆయన ఏకంగా కోర్టుకు ఎక్కారు.
అయినా ఓ విపక్ష నేతగా, ఓ కీలక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న జగన్... ఈ తరహాలో ఏపీ పోలీసులపై అభాండాలు వేసేలా వ్యవహరిస్తే ఎలాగంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలైతే ఏకంగా ఏపీ పోలీసులపై నమ్మకం లేని జగన్... ఏపీలో ఎందుకుంటున్నారని కూడా తమ మార్కు విమర్శలను గుప్పించారు. అయితే ఏపీ పోలీసులపై జగన్ వ్యక్తం చేసిన అనుమానాలు నూటికి నూరు పాళ్లు కరెక్టేనని నిరూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఎంత అనుమానాలు లేకపోతే... ఏకంగా జగనే ఏపీ పోలీసుల దర్యాప్తు వద్దంటారు చెప్పండి. ఇప్పుడు జగన్ వాదన నిజమనేలా జరిగిన ఘటన విషయానికి వస్తే... ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు కదా. అమెరికాలో కుటుంబం ఉంటుండగా, జయరాం వ్యాపార పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో వివాహేతర బంధాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిక్కుల్లో ఇరుక్కున్న జయరాంను రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే కదా. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు... నిన్న మొత్తం మిస్టరీని చేధించేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు. కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరిదే కీలక భూమిక అని ఆది నుంచి వినిపిస్తున్నా... చివరకు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన ఏపీ పోలీసులు రాకేశ్ రెడ్డిని నిందితుడిగా తేల్చేసి... జయరాం శవాన్ని కారులో ఎక్కించుకునే క్రమంలో రాకేశ్ రెడ్డికి సహకరించిన కారణంగా మరో వ్యక్తిని రెండో నిందితుడిగా తేల్చేసి చేతులు దులిపేసుకున్నారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఏపీ పోలీసులు నిర్వహించిన మొత్తం దర్యాప్తు, తేల్చిన నిజాలన్నింటినీ చూసిన జయరాం సతీమణి పద్మశ్రీ... నిన్న బాబు సర్కారుకు బొప్పి కట్టేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పోలీసుల నిర్వహించిన విచారణపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును తెలంగాణ పోలీసుల చేత జరిపించాలని ఆమె తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు తన భర్త హత్య కేసులో శిఖా చౌదరిపైనే తనకు అనుమానాలున్నాయని, ఏపీ పోలీసులు నిందితుడిగా తేల్చిన రాకేశ్ రెడ్డి ఎవరో తమకు అసలు తెలియనే తెలియదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా... ఈ కేసు దర్యాప్తు ఏపీ పోలీసులు చేపడితే... అసలు నిజాలు వెలుగులోకి రావని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా ఏపీ పోలీసులు నిర్వహించిన దర్యాప్తుపై ఆమె తన అనుమానాలను కుండబద్దలు కొట్టారు. వెరసి ఏపీ పోలీసులపై జగన్ చేసిన విమర్శలు నిజమేనని ఆమె చెప్పకనే చెప్పినట్టైందన్న వాదన వినిపిస్తోంది.