Begin typing your search above and press return to search.
సినిమా వాళ్ల గురించి ఆయనే మాట్లాడాలి మరి!
By: Tupaki Desk | 7 March 2019 2:37 PM GMTఒకప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ వైసీపీలో చేరారు. ఈ ఉదయం లోటస్ పాండ్ కు వెళ్లిన జయసుధ.. జగన్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. ఆమెతో పాటు ఆయన తనయుడు కూడా వైసీపీలో చేరాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన జయసుధ.. మళ్లీ తన ఇంటికి తాను వచ్చినట్లుగా అన్పిస్తుందని అన్నారు. తనని రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా వాళ్లందర్ని కాదని వైఎస్ తనని పిలిచి టిక్కెట్ ఇచ్చి తన గెలుపునకు కృషి చేశారని అన్నారు. ఇప్పుడు వైసీపీలోకి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన జయసుధ.. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అలాంటి అవకాశం లేకపోతే.. పార్టీ కోసం ప్రచారానికి వస్తానని చెప్పారు.
ఈ సందర్భంలో కొంతమంది విలేఖరులు జగన్ తో నాగార్జున భేటీ గురించి ప్రస్తావించారు. అలాగే.. సినిమా వాళ్లు జగన్ లాంటి వ్యక్తులను కలవడం దురకష్టకరమని చంద్రబాబు వ్యాఖానించడాన్ని కూడా జయసుధ వద్ద ప్రస్తావించారు. నాగార్జున సినిమా నటుడిగా జగన్‌ను వచ్చి కలవలేదని.. వైఎస్ కుటుంబానికి దగ్గని వ్యక్తిగా వచ్చి కలిశాడని అన్నారు. అయినా సినిమా వాళ్లు రాజకీయ నేతల్ని ఎందుకు కలవకూడదు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో సగం మంది సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారని గుర్తుచేశారు. సినిమా వాళ్లు అంటూ తక్కువ చేసి మాట్లాడడం తగదని.. వాళ్లు కూడా ఈ దేశంలో ఓటర్లే అనే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ యాడ్స్ చేయడానికి - పుష్కరాల నిర్వహణకు - పార్టీ ప్రచారానికి సినిమా వాళ్లు పనికి వస్తారు కానీ.. రాజకీయ నాయకుల్ని కలిసేందుకు మాత్రం పనికిరారా అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు జయసుధ. మొత్తానికి పార్టీలో చేరినరోజే.. చంద్రబాబు అదిరిపోయే కౌంటర్స్ ఇచ్చారు జయసుధ.