కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ తెలుగు నటిజయసుధ తెరాసలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికేజయసుధ టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లుపూర్తయినట్లు సమాచారం. జయసుధ కుమారుడు శ్రేయాన్నటించిన ‘బస్తీ' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారంనిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుహాజరయ్యారు. ఈ పరిణమాలన్నిటి నేపథ్యంలో ఆమె టీఆరెస్ లో చేరుతుందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలపై జయసుధజంకూగొంకూ లేకుండానే స్పందించారు... ఇంతవరకు టిఆర్ఎస్నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పారు కానీ తాను చేరబోవట్లేదని మాత్రం చెప్పలేదు. దీంతో ఆమె చేరిక ఖాయమేనంటున్నారు.
ఒకవేళ జయసుధ టీఆరెస్ లో చేరితే ఫక్తు ఆంధ్ర ప్రాంత నేత తెలంగాణ పార్టీలో ఉన్నట్లువుతుంది. ఇదో కొత్త ట్రెండవుతుంది. కాగా ఆమె టీఆరెస్ లో చేరుతుందని ఊహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ఆమె కార్యకలాపాలకు దూరంగాఉంటున్నారు కాబట్టి సస్పెండు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.