Begin typing your search above and press return to search.

వైసీపీలోకి జయసుధ.. బాబుకు షాక్

By:  Tupaki Desk   |   7 March 2019 9:27 AM GMT
వైసీపీలోకి జయసుధ.. బాబుకు షాక్
X
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా - కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన జయసుధ ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. సికింద్రాబాద్ లో ఓడిపోయాక.. వైఎస్ మరణం తర్వాత ఇక కాంగ్రెస్ లోనూ కొనసాగలేదు. ఆమె ప్రోత్సహించిన వైఎస్ లేకపోవడంతోపాటు కాంగ్రెస్ లో ఆమెకు తగిన గుర్తింపు రాకపోవడంతో దూరం జరిగారు. ప్రస్తుతం ఆమె తిరిగి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

ప్రముఖ సినీ నటి - సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. మూడేళ్ల క్రితమే 2016లో ఆమె ఏపీ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది బాబేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు 2019 ఎన్నికల వేళ అనూహ్యంగా ఆమె వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణలో పోటీచేసి వెలుగు వెలిగినప్పటికీ ఆమె అక్కడి రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ తరుఫున మాజీ మంత్రి - డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఉన్నారు. టీఆర్ ఎస్ లో చేరాలని చూసినా ఆమెకు గుర్తింపు ప్రాధాన్యత కష్టమే..అందుకే తెలంగాణ రాజకీయాలను వీడి ఆమె ఏపీ వైపు అడుగులు వేశారు. సినీ గ్లామర్ తక్కువగా ఉన్న వైసీపీలో చేరితే సీటుతో పాటు గెలుపు అవకాశాలు ఉంటాయని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా జయసుధ ఈ సాయంత్రం వైసీపీ అధినేత జగన్ తో భేటి కానున్నారు.. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరుతారు. అయితే జగన్ ఈమెను అసెంబ్లీ బరిలో దింపుతారా.? లేక పార్లమెంట్ సీటు ఇస్తారా అని తేలాల్సి ఉంది.