Begin typing your search above and press return to search.
ఈ టీడీపీ తమ్ముళ్లు యమ డేంజర్ `బాబో`య్..!
By: Tupaki Desk | 25 Oct 2022 6:16 AM GMTటీడీపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. కొందరి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వారు పార్టీలోనే ఉండి.. పార్టీకి చేటుచేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. చంద్రబాబు అందరినీ నమ్ముతున్నారో లేదో .. తెలియదు కానీ.. కొందరిని మాత్రంబాగా నమ్ముతున్నారు. అయితే.. ఆ కొందరు మాత్రం ఆయనకు దెబ్బేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు పార్టీని అదికారంలోకి తీసుకవచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి ఉన్న అన్ని మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్‌తో చేతులు కలిపారు. దీనిపై విమర్శలు వస్తాయని.. గత ఎన్నికలకు ముందు పవన్ ఆయనను, కుటుంబాన్నివిమర్శించిన విషయం కూడా.. వైసీపీ నేతల నుంచి విమర్శల రూపంలో ఎదుర్కొనక తప్పదని తెలిసినా.. పార్టీ కోసం.. ఇవన్నీ పక్కన పెట్టిమరీ చంద్రబాబు చేతు లు కలిపారు. అయితే.. ఇంత చేస్తున్నా.. పార్టీలోని కీలక నేతలు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారనేది వాస్తవం అంటున్నారు సీనియర్లు. వారిలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని జేసీ బ్రదర్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం.
జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు.. పార్టీలోనే ఉన్నారు. కానీ, పార్టీ తరఫున వాయిస్ వినిపించకపోగా.. జరుగుతున్న పరిణామాలపై వారు స్పందించక పోగా టీడీపీ నేతలకు వ్యతిరేకంగా.. చక్రం తిప్పుతున్నారు. పుట్టపర్తి సహా అనంతపురం అర్బన్‌లలో తాము చెప్పిన నేతలకే.. చంద్రబాబు టికెట్ ఇస్తారని.. తాజాగా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ... పార్టీలో వివాదంగా మారింది. జిల్లా వ్యాప్తంగా.. కూడా.. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి బలం ఎక్కువగా ఉంది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభాకర్ చౌదరిలు.. యాక్టివ్‌గా ఉన్నారు.
అయితే.. జేసీలు చేస్తున్న ఈ వ్యాఖ్యలతో కార్యకర్తలు వారికి దూరమవుతున్నారు. ఇక, విజయవాడ పశ్చిమలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా పార్టీలోనే ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో తాను కాదని.. కుమార్తెను రంగంలోకి దింపారు. ఆమె ఓడిపోవడంతో అమెరికాకు వెళ్లిపోయారు. తర్వాత.. పార్టీని పట్టించుకున్న వారు లేరు. అయినా.. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు.
కానీ,పార్టీ కార్యక్రమం అంటే.. మాత్రం నాకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు.పైగా.. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా.. నా మద్దతు దారులు.. సహించబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది నాయకులుఉ ఉన్నారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. మరి చంద్రబాబు ఇలాంటి వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారో.. అర్ధం కావడం లేదని అంటున్నారు.