Begin typing your search above and press return to search.
ఇదీ... హలో బ్రదర్స్ మాట...
By: Tupaki Desk | 22 Aug 2018 4:24 PM GMTఅనంతపురం. కొన్నాళ్ల పాటు ఫ్యాక్షర్ రాజకీయాలకు నెలవు. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరు ఓ పార్టీలో ఉంటూ మరొకరు మరో రాజకీయ పార్టీలో చేరి వాళ్ల వాళ్ల ఫ్యాక్షనిజాన్ని బయటపెట్టుకునే వారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. గడచిన కొన్నాళ్లుగా అక్కడి రాజకీయ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికారు. కేవలం రాజకీయాలకే పరిమితం అయ్యారు. అవుతున్నారు. ఇది శుభ పరిణామమే. అయితే పాత ఫ్యాక్సన్ రాజకీయాల వాసన మాత్రం జిల్లాను వదలడం లేదు. ఇందులో భాగమే వారసత్వ రాజకీయం. ఫ్యాక్సన్ వివాదాల్లో కూడా వారసత్వమే రాజ్యమేలేది. వీరి తండ్రిని చంపింది వారని, వారి మనుషులను చంపింది వీరంటూ వారసులు ఫ్యాక్షన్ తగాదాలకు తెర తీసే వారు.
ఇప్పుడు ఆ వాతావరణం రాజకీయాల్లో కూడా కనిపిస్తోంది. దీనికి ఉదాహరణే అనంతపురం జిల్లాలో జె.సి. దివాకర్ రెడ్డి సోదరులు వారసత్వ రాజకీయం. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ సభ్యుడు జె.సి.దివాకర్ రెడ్డి - ఆయన సోదరుడు - శాసనసభ్యుడు జె.సి. ప్రభాకర రెడ్డి పోటీ చేయనని చెబుతున్నారు. వారికి బదులుగా వారి కుమారులను ఎన్నికల బరిలోకి దింపాలన్నది వారి ఉద్దేశ్యం. వయోభారంతో పాటు కుమారులకు రాజకీయ భవిష్యత్ కు మెట్లను ఏర్పాటు చేసేందుకు ఆ అన్నదమ్ములు తమ రాజకీయ మనుగడకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తమకు టిక్కట్లు వద్దని, తమ కుమారులకు టిక్కట్లు ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని కోరుతున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో ఎక్కువ స్ధానాలే దక్కాయి. ఈ సారి వై.ఎస్.కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్న పమయంలో దివాకర్ రెడ్డి సోదరులు కాకుండా వారి కుమారులు బరిలోకి దిగితే మొదటికే మోసం వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఆలోచన. దీంతో కుమారులను కాదని - వారి తండ్రులనే రంగంలోకి దించాలని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని జెసీ సోదరులకు కూడా చెప్పినట్లు సమాచారం. దీనికి ససేమిరా అన్న జెసీ సోదరులు తమ కుమారులకే టిక్కట్లు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయంగా కనిపిస్తున్నదని, దీంతో జేసీ సోదరులు ఓటమిని తమ కుమారుల వైపు నెట్టేసి తాము మాత్రం బయటపడాలనుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొన్నటి వరకూ ప్రతిపక్ష నేతపై దారుణ భాషతో విరుచుకుపడిన జె.సీ.దివాకర్ రెడ్ది అనంతపురం జిల్లాలో ఓటమి పాలైతే తలెత్తుకునే పరిస్ధితులుండవు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ సోదరులిద్దరు రానున్న ఎన్నికల బరిలో నిలవకుండా కుమారులను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.