Begin typing your search above and press return to search.
మాట వినకపోతే...జేసీ బ్రదర్స్ చంపేస్తారట!
By: Tupaki Desk | 4 Aug 2017 10:52 AM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి - అదే జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డిలు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే రోజుకో వివాదంలో చిక్కుకుంటున్న జేసీ బ్రదర్స్ వ్యవహారం టీడీపీ అధిష్ఠానికి పెద్ద తలనొప్పిగానే పరిణమించిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఈ తాజా వివాదంపై జేసీ బ్రదర్స్ పై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.
ఇక జేసీ బ్రదర్స్‌ను చుట్టుముట్టిన తాజా వివాదం విషయానికి వస్తే... అనంతపురం జిల్లాలో మైనింగ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డికి జేసీ బ్రదర్స్ నుంచి బెదిరింపులు వెళ్లాయట. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు గా కొనసాగుతున్న రవీంద్ర రెడ్డి నుంచి వెళ్లిన ఈ బెదిరింపులతో బెంబేలెత్తిపోయిన ప్రతాప్ రెడ్డి... నేరుగా ఉన్నాధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులో ఆయన... తనకు ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టారు. గత కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ప్రతాప్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారట. అక్రమ మైనింగ్ ను తక్షణమే మానుకోవాలని ఆయన అక్రమార్కులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు రవీంద్రరెడ్డి లైన్ లోకి వచ్చేశారు.
పద్దతి మార్చుకోకుంటే చంపేస్తామంటూ ఆయన ప్రతాప్ రెడ్డిని బెదిరించారట. దీంతో బెంబేలెత్తిపోయిన ప్రతాప్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. తాడిపత్రి మైనింగ్ మాఫియా నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆయన తన ఫిర్యాదులో అధికారులకు ఏకరువు పెట్టారట. ఈ తాజా వివాదం టీడీపీకి మరో తలనొప్పిగానే పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి ఎయిర్ లైన్స్ సంస్థలు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయించుకునేందుకు నానా తంటాలు పడ్డ జేసీ దివాకర్ రెడ్డి... తన సోదరుడి ముఖ్య అనుచరుడు పాల్పడిన బెదిరింపుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.