Begin typing your search above and press return to search.

జేసీ బ్ర‌ద‌ర్స్‌.. పాలిటిక్స్ ఏం జ‌రుగుతుంది..?

By:  Tupaki Desk   |   31 Dec 2021 4:10 AM GMT
జేసీ బ్ర‌ద‌ర్స్‌.. పాలిటిక్స్ ఏం జ‌రుగుతుంది..?
X
జేసీ బ్ర‌ద‌ర్స్‌. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేని సోద‌రులు. అయితే.. ఇప్పుడు వీరి రాజ‌కీయాలు ఎటు మ‌లుపు తిరుగుతున్నాయి? అనేది కీల‌కంగా మారింది. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. దివాక‌ర్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం లోనే కాడి ప‌డేసి.. త‌మ కుమారుల భుజాల‌పైకి ఎత్తారు. దివాక‌ర్‌రెడ్డి అనంత ఎంపీ స్థానం నుంచి త‌న కుమారుడు ప‌వ‌న్‌ను పోటీ పెట్టారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. త‌న కుమారుడు.. అస్మిత్‌ను తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రంగంలోకి దింపారు. ఆయ‌న కూడా ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేదిఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్నారు. సో.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయరు. కాబ‌ట్టి.. తిరిగి ఆయ‌న కుమారుడికే అవ‌కాశం ఇస్తారు. ఇక‌, దివాక‌ర్ కూడా.. వ‌యోవృద్ధులు కావ‌డంతో.. ఆయ‌న కూడా తిరిగి కుమారుడికే జై కొడ‌తారు. ఇంత వ‌ర‌కు క్లారిటీ ఉంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి కి.. వీరు టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగుతారా? లేక వైసీపీనా.. ఇవ‌న్నీ కాకుండా.. బీజేపీనా.. అనే చ‌ర్చ అనం త‌పురం రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీనికి కార‌ణం.. టీడీపీలో వీరికి ఆశించిన మేర‌కు ఫాలోయింగ్ ల‌భించ‌డం లేదనే టాక్ ఉంది.

స్థానిక నేత‌లు ఎవ‌రూ కూడా జేసీ బ్ర‌ద‌ర్స్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. వీరు కూడా అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ హ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు ఇస్తున్న పిలుపును అందుకుని.. వీరు వాయిస్ కూడా వినిపించడం లేదు. దీంతో పార్టీకి.. వీరికి గ్యాప్ పెరిగింది. మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. టీడీపీ అధికారంలోకి రావ‌డం డౌటే.. అంటూ.. ఇటీవ‌ల ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం.. పార్టీలో నూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇక‌, బీజేపీ క‌నుక త‌న‌కు రాజ్య‌స‌భ టికెట్ ఇస్తే.. బాగుంటుంద‌నే వ్యూహంతో రెండు సార్లు ఢిల్లీ వ‌ర‌కు వెళ్లివ‌చ్చారు. ఇది మ‌రో ముచ్చ‌ట‌.

మ‌రోవైపు.. తొలి ఏడాది వ‌రుస పెట్టి.. జేసీ ప్ర‌భాక‌ర్‌, ఆయ‌న కుమారుడిపై కేసులు పెట్టిన‌.. వైసీపీ త‌ర్వాత త‌గ్గింది. ఈ క్ర‌మంలో ఏదో ఒప్పందం జ‌రిగింద‌ని అంటున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాడిప‌త్రి వైసీపీ టికెట్ అస్మిత్‌కు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీంతో ఇప్ప‌టికే ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. వైసీపీకి అనుకూలంగా మారుతున్నార‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపుదివాక‌ర్‌రెడ్డి ప‌రిస్థితి మాత్రం బీజేపీ వైపు చూస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది. అంటే..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి .. ఇద్ద‌రుసోద‌రులు.. చెరో వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డంగ‌మ‌నార్హం.