Begin typing your search above and press return to search.

'సిగ్గులేని జేసీ ..మానం లేని బాబు'

By:  Tupaki Desk   |   7 Jan 2020 6:49 AM GMT
సిగ్గులేని జేసీ ..మానం లేని బాబు
X
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌ రెడ్డి సంచలనాలకు మారుపేరు అని తెలిసిందే. అయన ఏ క్షణంలో ఏమి మాట్లాడతారో ఆయనకి కూడా తెలియదు. ఆ సమయంలో ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. తన ఎదుట , పక్కన ఎవరున్నారు అని కూడా చేసుకోరు. ఆలా ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేసి ..ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తుంటారు. ఇకపోతే అప్పుడప్పుడు తనపై తానే కామెంట్స్ చేసుకుంటారు. తాజాగా అయన సొంత పార్టీ అయిన టీడీపీ పై కూడా తనదైన వాక్చాతుర్యం తో రెచ్చిపోయారు.

దేశంలో ప్రాంతీయ పార్టీల పీడ పోవాల్సిందే. మా తెలుగుదేశం తో స‌హా అని జేసీ దివాక‌ర్‌ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రాంతీయ పార్టీలపై , అలాగే టీడీపీ పై అయన చేసిన ఈ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత కూడా అనంత‌పురంలో సోమ‌వారం ఆయ‌న మరోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేసారు. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా కుటుంబ పాలన సాగుతోందని , అలాగే రాజధాని పేరుతో టీడీపీ, వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నది వాస్తవమని జేసీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తన అభిప్రాయాన్ని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తం గా ఈ కామెంట్స్ ఇప్పుడ పలు చర్చలకు దారి తీసింది.

టీడీపీ స‌హా ప్రాంతీయ పార్టీల పీడ విరగడ కావాలి అని అనడం , ప్రాంతీయ పార్టీల్లోకుటుంబ పాల‌న సాగుతోంద‌నడం, రాజ‌ధాని పేరుతో టీడీపీ ,వైసీపీ నేత‌లు వేల కోట్లు దోచుకున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన జేసీ పై చంద్ర‌బాబు మౌనంగా భ‌రించ‌డం వెనుక భ‌య‌మా..లేక ఆ మాటల వెనుక ఏదైనా ఒక ప్రత్యేక వ‌్యూహం దాగి ఉందా అని టీడీపీ ముఖ్య నేత‌లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ వారు టీడీపీ నేతలపై రాజధాని భూముల విషయంలో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ సమయం లో వాటికి మరింత బ‌లం ఇచ్చేలా జేసీ మాటలు ఉన్నాయ‌ని, పార్టీకి న‌ష్టం క‌లిగిస్తున్న జేసీ పై మౌనంగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాద‌నే అభిప్రాయం టీడీపీ లో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ లో ఉంటూ , అదే పార్టీ పై విపరీతమైన కామెంట్స్ చేస్తున్న జేసీ కి సిగ్గులేదని ... ఆయ‌న‌ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా ప్రేక్ష‌క పాత్ర పోషిస్తున్న చంద్ర‌బాబు కు మానం లేద‌ని ...ఎవరు చూసిన చెప్పరు అని , ఇద్దరికి ఇద్దరే అంటూ ఆ పార్టీ నేత‌లు అంత‌ర్గ‌తం గా కామెంట్స్ చేసుకుంటుండటం విశేషం.