Begin typing your search above and press return to search.

అప్పుడే చంద్రబాబు వీపు పగలాల్సింది: జేసీ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   16 March 2021 9:59 AM GMT
అప్పుడే చంద్రబాబు వీపు పగలాల్సింది: జేసీ హాట్ కామెంట్స్
X
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడిన కుండబద్దలు కొట్టేస్తారు. అక్కడ చంద్రబాబు, మోడీ ఉన్న ఆయన దేహ భాష మారదు. వారిముందే కడిగేస్తారు.. నెత్తిన పెట్టుకుంటాడు. ఈ రాయలసీమ రెడ్డప్ప తాజాగా చంద్రబాబుకు సీఐడీ నోటీసులపై హాట్ కామెంట్స్ చేశారు.

మంగళవారం హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలు భట్టి, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డితో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఆలస్యమైందని.. 3 నెలల క్రితమే బాబుకు నోటీసులు రావాల్సి ఉందని బాంబు పేల్చారు.

'మా వీపు పగిలినప్పుడే చంద్రబాబుకు పగలాల్సిందని.. ఎందుకు ఆలస్యమైందనే మా అనుమానం' అని జేసీ దివాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నోటీసులు చూసి ఆశ్చర్యపోలేదని జేసీ అన్నారు. చంద్రబాబుకు ఒక్క పేజీ మాత్రమే నోటీసు వచ్చిందని.. జగన్ కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలని జేసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ కు నష్టం చేశారు.. విభజిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆనాడే సోనియాకు చెప్పానని జేసీ అన్నారు. రాయల తెలంగాణ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు.. రాహుల్ కు యూపీ బ్రాహ్మణ యువతితో పెళ్లి చేయాలని సోనియాకు చెప్పానని..ఏవీ చేయడం పోవడంతో కాంగ్రెస్ జీవం పోయిందని జేసీ ఆవేదన చెందారు.

అమరావతి రాజధాని భూముల అక్రమాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న అధికారులు, నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరినట్లు తెలిపారు. మొత్తం ఆరుగురు అధికారులు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి లోపలికి వెళ్లి నోటీసులు అందజేశారు. రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. చంద్రబాబు అనుయాయులు లబ్ధి పొందారన్న ఆరోపణలతో ఈ నోటీసులు అందజేసినట్లు సమాచారం.