Begin typing your search above and press return to search.
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలపై దివాకర్ కామెంట్!!
By: Tupaki Desk | 17 Sep 2021 5:30 PM GMTఅనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ ఎప్పుడూ.. రాజకీయంగా.. దూకుడుగా ఉంటారనేది తెలిసిందే. ఫైర్ బ్రాండ్ నాయకులుగా దివాకర్, ప్రభాకర్‌రెడ్డిలకు పేరున్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్.. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఈ ఇద్దరు సోదరులు ఎప్పుడూ.. సంచలన కామెంట్లకు కేరాఫ్‌గా ఉంటున్నారు. తాజాగా మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీమలో టీడీపీ పరిస్థితి ఇబ్బందుల్లో ఉంది. నాయకులు ఎక్కడికక్కడ ఎవరి దారిలో వారు ఉన్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా ఇబ్బందుల్లో పడింది.
అయితే.. ఒక్క తాడిపత్రి మునిసిపాలిటీని మాత్రం టీడీపీ దక్కించుకుంది. దీనిపై జేసీ దివాకర్‌రెడ్డి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే.. పార్టీ పటిష్టంగానే ఉందని చెబుతూ.. అనంతపురంలో.. పార్టీ ఎందుకు వెనుకబడిందో మాత్రం .. తనకు తెలియదని ఆసక్తిగా స్పందించారు. ఇటీవల.. దివాకర్‌రెడ్డి సోదరుడు.. తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్.. ప్రభాకర్రెడ్డి.. జిల్లాలో పార్టీ పరిస్థితి, పార్టీ శ్రేణుల దుస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరని ఉద్దేశిస్తూ పరోక్షంగా జేసీ కామెంట్లు చేయడంతో ఆ నేతలను నొచ్చుకున్న పరిస్థితి.. ఏర్పడింది.
దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని.. హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్లింది. అయితే.. ఇంత జరిగినా.. కూడా.. దివాకర్ రెడ్డి మాత్రం ఆసక్తిగా స్పందించారు. తనను కలిసి పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీలోనైనా విబేధాలు సహజం.. భిన్నాభిప్రాయాలు ఉంటాయన్న ఆయన.. పార్టీకి హాని కలిగే విబేధాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదన్నారు. రెండేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు.. అన్ని గమనిస్తున్నాను.. టీడీపీ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.
పార్టీకి నష్టం కలిగించే స్థాయిలో టీడీపీలో విభేదాలు లేవని చెప్పారు. అయతే.. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలలో ఒక్క తాడిపత్రి మున్సిపాల్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. అనంతపురం జిల్లాలో ఎక్కడా రెండు కౌన్సిలర్ స్థానాలు కూడా టీడీపీ గెలుచకపోవడం దురదృష్టకరం అన్నారు.. తన దగ్గరకు టీడీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారో తెలియదన్న ఆయన.. తన వద్దకు ఎవరు వచ్చినా బాగోగులు అడుగుతానే తప్ప రాజకీయాలపై చర్చించడం జరగలేదన్నారు.. అయితే, జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలని కామెంట్ చేశారు. వాస్తవానికి ఆయన సొంత సోదరుడి వ్యాఖ్యలపై ఇలా దివాకర్ వ్యాఖ్యానించడం.. ఆసక్తిగా మారింది. మరి దీనిపై సీనియర్లు ఏ మంటారో చూడాలి.