Begin typing your search above and press return to search.
అనంత టీడీపీలో కొత్త ట్విస్ట్..!
By: Tupaki Desk | 11 July 2016 9:50 AM GMTసీమ అంటేనే కక్షా రాజకీయాలకు పెట్టింది పేరు. అందులోనూ అనంతపురం అంటే చెప్పేదేముంది! కక్షలకు - ఘర్షణలకు కేరాఫ్! అలాంటి జిల్లాలో ఇప్పుడు అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి వర్గాలుగా దశాబ్దాల తరబడి వైరం కొనసాగించిన రెండు ప్రముఖ కుటుంబాలు మనస్పర్థలకు స్వస్తి పలుకుతున్నట్టు కనిపిస్తోంది. తమ రాజకీయ వైషమ్యాలకు తెరదింపే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆరెండు ప్రత్యర్థి వర్గాలు ఎవరో కారు పరిటాల - జేసీ కుటుంబాలు. ఈ రెండు కుటుంబాల మధ్య పరిటాల రవి హయాం నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
ఈ రెండు వర్గాలు ఒకరు టీడీపీ మరొకరు కాంగ్రెస్ కావడంతో ఈ వైరం మరింత ముదిరింది. ఇది ఒకప్పటి సంగతి. అయితే, ప్రస్తుతం జేసీ వర్గం కూడా టీడీపీలోనే ఉండడం, ఈ పార్టీ నుంచే జేసీ సోదరులు ఎంపీ - ఎమ్మెల్యేగా గెలుపొందడంతో జిల్లాలో టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు కుటుంబాలు - ఒకే పార్టీ అన్నట్టుగా ఉన్న జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పు... రెండు కుటుంబాల నేతలూ కలిసి పోయారా అన్నట్లు ఉన్న పరిణామాలు.... టీడీపీ అధినేత చంద్రబాబు మాటకు ఇరు పక్షాలూ కట్టుబడ్డట్టుగా ఉన్న వాతావరణం కనిపిస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..ఆ మధ్య హంద్రీ- నీవా ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చారు. ఆయన వెంట పరిటాల శ్రీరామ్ కూడా ఆత్మకూరుకు వచ్చారు. అక్కడ ఎదురుపడిన జేసీ దివాకర్ రెడ్డి పరిటాల శ్రీరామ్ ను ఆత్మీయంగా పలుకరించారు. శ్రీరామ్ కూడా ఆయనకు ప్రతినమస్కారం చేసి గౌరవించారు. జిల్లా ప్రజానీకానికి ఈ సన్నివేశం ఆశ్చర్యానందాలను కలిగించిన మాట వాస్తవం. ఇటువంటి సన్నివేశమే మరోసారి జడ్పీ చైర్మన్ నివాసం వద్ద పునరావృతమైంది.
రంజాన్ సందర్భంగా జడ్పీ చైర్మన్ చమన్ ముస్లింలకు విందు ఏర్పాటుచేశారు. రాజకీయ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై ఉండి పరిటాల శ్రీరామ్ - జేసీ దివాకర్ రెడ్డి ప్రార్థనలు జరిపారు. ఈ దృశ్యం కూడా రాజకీయ వర్గాలకు ఆసక్తిని కలిగించింది. గత కొన్నేళ్లుగా వీరిమధ్య సిద్ధాంతాలు - రద్దాంతాలు ఉన్నా పార్టీ వైఖరికి కట్టుబడి - సీఎం చంద్రబాబు మాటకి విలువ ఇవ్వడం వల్లే ఈ రెండు కుటుంబాల ప్రతినిధులు కలివిడి మసలుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. జేసీ నాగిరెడ్డి ట్రస్ట్ - స్పర్శ సంస్థల ఆధ్వర్యంలో దివాకర్ రెడ్డి ఫ్యామిలీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. జేసీ కుటుంబం నుంచి పవన్ కుమార్ రెడ్డి - అస్మిత్ రెడ్డిలను భావినేతలుగా జేసీ వర్గీయులు పేర్కొంటున్నారు. పరిటాల ఫ్యామిలీ నుంచి అంబాసిడర్ గా శ్రీరామ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. భవిష్యత్తులో ఈ యువనేతలంతా కలసికట్టుగా పనిచేస్తే జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇలా జరిగితే అటు ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట పడడం, ఇటు టీడీపీకి ఎంతో మైలేజ్ పెరగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.