Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీలపై జేసీ `దూకుడు`!
By: Tupaki Desk | 8 March 2018 10:26 AM GMTఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీలు నెరవేర్చాలంటూ...పార్లమెంటు లోపల - వెలుపల టీడీపీ - వైసీపీ ఎంపీలు నిరసనలు తెలుపుతోన్న సంగతి తెలిసిందే. ఎంపీల ఆందోళనతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని...కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ మరోసారి స్పష్టం చేయడంతో....టీడీపీ తరఫున కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంటు బయట టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి - వైసీపీ ఎంపీలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారని,....వైసీపీ ఎంపీలు కూడా చేయాలని జేసీ......వారిపైకి దూసుకెళ్లడంతో కొంత గందరగోళం ఏర్పడింది. బాధ్యత గల ఎంపీ హోదాలో ఉన్న జేసీ.....సాటి ఎంపీలపై దూకుడుగా వెళ్లడం - తొడ గొట్టి మీసం మెలేయడం వంటి పరిణామాలను చూసిన జాతీయపార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. జేసీ.... తెలుగు ఎంపీల పరువు తీశాడని పలువురు మండిపడుతున్నారు.
పార్లమెంటు బయట వైసీపీ ఎంపీలపై జేపీ దూకుడుగా వ్యవహరించారు. తొడకొట్టి మీసం మెలేసి వారి పైకి దూసుకు వెళ్లారు. పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్న వైసీపీ ఎంపీల దగ్గరకు జేసీ వెళ్లారు. ఆ సమయంలో .....హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది తామేనని వైసీపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. హోదా అంటే జైలుకే అని గతంలో బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ దారిలోకే వచ్చారని,వారు ఆరోపించారు. దీంతో, జేసీ వారివైపునకు ఆవేశంగా దూసుకెళ్లడంతో కొంత గొడవ జరిగింది. తమ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తున్నారని, దమ్ముంటే వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని జేసీ సవాల్ విసిరారు. మీసం మెలేస్తూ - తొడగొడుతూ..... మూతి మీద మీసం ఉంటే ఇప్పుడే రాజీనామాలకు కదలాలని డిమాండ్ చేశారు. అందరం కలసి కట్టుగా ఈ రోజే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేద్దామని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని కౌంటర్ ఇచ్చారు.