Begin typing your search above and press return to search.
జేసీ ప్రభాకరరెడ్డి ఎక్కడున్నారో తెలిసింది
By: Tupaki Desk | 6 Feb 2016 2:18 PM GMTవారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి దక్షిణాప్రికాలో ఉన్నారట. తన అనుచరులకు పెయిడ్ గన్ మెన్ లను కేటాయించడంపై అలక వహించిన ప్రభాకర్ రెడ్డి వారం రోజులుగా కనిపించడం లేదు. అనుచరులకు ఉచితంగా గన్‌మెన్లు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ తన గన్ మెన్ లను కూడా ఆయన వెనక్కు పంపించారు. అప్పటి నుంచి ఆయన బయట కనిపించడం లేదు. జేసీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కొందరు, హైదరాబాద్ లో ఉన్నారని రకరకాల ప్రచారం జరిగింది. దీంతో ప్రభాకరరెడ్డి సోదరుడు జేసీ దివాకరరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. తన తమ్ముడేమీ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లలేదని చెప్పారు.
తన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోలేదని దక్షిణాఫ్రికా వెళ్లారని దివాకర్ రెడ్డి మీడియాతో తెలిపారు. గన్ మెన్ల వ్యవహారం తాను జోక్యం చేసుకోవాల్సినంత పెద్దది కాదని జేసీ అన్నారు. తన తమ్ముడు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టేనన్నారు. దక్షిణాఫ్రికా టూర్ చాలా కాలం క్రితమే అనుకున్నది కాబట్టి ఆయన వెళ్లారని... అయితే.. ఈ వివాదం సమయంలో వెళ్లడంతో దానికి మీడియా రకరకాల రంగులు పులుముతోందని అన్నారు. తుని ఘటన తర్వాత సీఎం, హోంమంత్రి బిజీగా ఉన్నారని ఈ సమయంలో గన్‌మెన్ల వ్యవహారం వారితో చర్చించడం పద్దతి కాదని అందుకే ప్రభాకర్ రెడ్డి దక్షిణాఫ్రికా వెళ్లారని తెలుస్తోంది. పదేళ్ల నుంచి దక్షిణాఫ్రికాలో జేసీ ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన తనయుడు జేసీ అశ్మిత్‌రెడ్డి పలు వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని గనులను కూడా లీజులకు తీసుకొని నడుపుతున్నారని చెబుతుంటారు. వాటి పని మీద ప్రభాకర్ రెడ్డి దక్షిణాఫ్రికా వెళ్లారని తెలుస్తోంది.