Begin typing your search above and press return to search.
జగన్ కు 150 మార్కులేస్తా - జేసీ
By: Tupaki Desk | 23 Oct 2019 12:00 PM GMTమీడియాకు ఆసక్తికరమైన వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి. ఏదైనా చాలా క్యాజువల్ గా మాట్లాడేస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా అతని తీరు వేరు. తాజాగా ఆయన ట్రావెల్స్ కు చెందిన 31 బస్సులు సీజ్ చేయడంతో మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు జేసీ. ఏపీలో లెక్కలేనన్ని ట్రావెల్స్ సంస్థలున్నాయి. కానీ సీజ్ చేయడానికి వీళ్లకు మా బస్సులే కనిపించాయి. అయినా, ట్రావెల్స్ వ్యాపారాల్లో చిన్నచిన్న లోపాలు సహజం. ఆ మాటకొస్తే ఆర్టీసీలోనూ ఈ లోపాలుంటాయి. దానికే సీజ్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు జేసీ. తన బస్సులను భూతద్దంలో చూశారని అన్నారు. మేము 70 ఏళ్ల నుంచి రవాణా రంగంలో ఉన్నాం. ఈ అవాంతరాలు లోతుగా తెలుసు మాకు అన్నారు.
ఇక పాలన గురించి స్పందిస్తూ... తనదైన వ్యాఖ్యలు చేశారు. పాలన జనరంజకంగా ఉందన్నారు. అపుడు - ఇపుడు - ఎపుడూ జగన్ మా అబ్బాయే. పరిపాలనలో కిందా మీదా పడుతున్నాడు. నేను జగన్ పరిపాలనకు 150/100 మార్కులు వేస్తాను. మరి జేసీ మాటల్లో ఆంతర్యం కొంచెం తేడాగానే ఉంది. బస్సులు సీజ్ చేసిన అక్కసు కొంచెం మాటల్లో కనిపిస్తోంది.
ఇక తన రాజకీయ సన్యాసం గురించి కూడా మరోసారి ప్రస్తావించారు. కావాలనే రాజకీయాలను వదిలేశాను. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు. కొడుకు కోసం దివాకర్ రెడ్డి రాజకీయ సన్యాసం చేశారు. అది అందరికీ తెలుసు. కానీ... జీవితాంతం ఓటమి చూడకుండా గెలిచిన నేత... జగన్ గాలిలో అంగ బలం - అర్థ బలం ఉన్నా... కొడుకును గెలిపించుకోలేకపోయారు.