Begin typing your search above and press return to search.

బాబు ముందు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేసిన జేసీ

By:  Tupaki Desk   |   26 May 2017 11:52 AM GMT
బాబు ముందు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేసిన జేసీ
X
ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్ప‌టం.. కుండ బ‌ద్ధ‌లు కొట్టేయ‌టం ఏపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి బాగా అల‌వాటు. మ‌న‌సులో ఉన్న దాన్ని దాచేసి.. న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడ‌టం అస్స‌లు చేత‌కాదు. అలాంటి వ్య‌క్తి.. బాబు మూడేళ్ల పాల‌న‌ను అసెస్ చేసేసి.. గ్రౌండ్ లెవెల్లో జ‌నాలు ఏమ‌నుకుంటున్నార‌న్న విష‌యాన్ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా ఏపీ సీఎం చంద్ర‌బాబుకే సూటిగా సుత్తి కొట్ట‌కుండా చెప్పేసిన‌ట్లుగా చెబుతున్నారు.

కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ ఆస‌క్తిక‌ర ఉదంతానికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం ఉద‌యం తొమ్మిది గంట‌ల ప్రాంతంలో జేసీకి బాబు టైమిచ్చార‌ట‌. ఈ సంద‌ర్భంగా తాను ఓపెన్ గా మాట్లాడేస్తాన‌ని చెప్పిన జేసీ.. ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు నిజాలు చేదుగా క‌నిపిస్తాయని.. క‌ళ్ల ముందు జ‌రిగే వాటిని కూడా చూడ‌లేమ‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే న‌ష్ట‌మేన‌ని వార్నింగ్ ధోర‌ణిలో బాబుకు చెప్పార‌ట‌.

ప్ర‌భుత్వం ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని చేప‌డుతున్నా ఆశించినంత స్పంద‌న క‌నిపించ‌టం లేద‌న్న ఆయ‌న‌.. పార్టీలో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాల్ని బాబు దృష్టికి తీసుకెళ్లార‌ట‌. బాబును త‌న తీరును మార్చుకోవాల‌న్న సూచ‌న కూడా చేశార‌ట‌. ప్ర‌భుత్వం అనేక మంచి ప‌నులు చేసినా రావాల్సినంత మంచిపేరు రావ‌టం లేద‌న్న జేసీ.. కృష్ణా.. గుంటూరు జిల్లాల్లోని భూముల‌కు విప‌రీత‌మైన ధ‌ర‌లు పెరిగాయ‌ని.. ప్ర‌జ‌లెంతో లాభ‌ప‌డ్డార‌ని చెప్పార‌ట‌. ప్ర‌భుత్వం వ‌ల్ల లాభం పొందిన వారు కూడా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నార‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. పుట్టిన బిడ్డ‌కు.. త‌ల్లీబిడ్డ‌ల్ని ఇంటికి క్షేమంగా పంప‌టం లాంటి వినూత్న కార్య‌క్ర‌మాల్ని ప్ర‌భుత్వం చేస్తున్నా రావాల్సినంత మంచి పేరు రావ‌టం లేద‌ని.. మైలేజీ మిస్ అవుతోంద‌ని.. దీనిపై దృష్టిసారించాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

పార్టీలోనూ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఇలాంటి వారిలో క్ర‌మ‌శిక్ష‌ణ‌రాహిత్యాన్ని స‌హించ‌కూడ‌ద‌ని.. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న సూచ‌న‌ను కూడా చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌ప్పు చేసిన వారిపై పార్టీ చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం మీద అంద‌రికి తెలిసేలా శిక్ష‌లు అమ‌లు చేయాల‌ని కోరిన‌ట్లు చెబుతున్నారు. జేసీ ప్ర‌స్తావించిన ప‌లు అంశాల్ని చంద్ర‌బాబు ఏకీభ‌వించిన‌ట్లుగా తెలుస్తోంది. పలు సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టినా రావాల్సినంత పేరు రావ‌టం లేద‌ని.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల‌ అంత‌గా తృప్తి లేద‌ని అభిప్రాయ‌ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌భుత్వం చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు ప్రజ‌ల్లోకి వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/