Begin typing your search above and press return to search.
బాబు గెలుపుపై జేసీ ధీమా!...లాజిక్కు సరిపోలేదండీ!
By: Tupaki Desk | 29 April 2019 4:16 AM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ముగిసినా.. ఫలితాల కోసం ఇంకా 25 రోజులు ఆగాల్సిందే. అయితే రాజకీయ నేతలన్నాక.. ఫలితాలు వచ్చేదాకా సైలెంట్ గా ఉండలేరు కదా. టీడీపీ సీనియర్ నేత - అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అయితే అస్సలు నోటికి తాళం వేసుకుని కూర్చోలేరు. ఎప్పుడు బయటకు వచ్చినా.. మీడియా మైకులు కనిపించగానే... తనదైన శైలిలో విన్యాసం చేసే జేసీ ఏపీ ఫలితాలపై ఇప్పటికే చాలా సార్లు మాట్లాడారు. మరోమారు టీడీపీదే అధికారమని - 23న చంద్రబాబే మళ్లీ సీఎంగా గెలవబోతున్నారని ఆయన చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా ఆదివారం కూడా ఆయన ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా... చంద్రబాబే మరోసారి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి మాత్రం ఆయన లాజిక్కు వదిలేసి విన్యాసం చేశారన్న వాదన వినిపిస్తోంది.
అయినా జేసీ ఏమన్నారంటే... *ప్రజలు ఐదేళ్ల పాటు ఎంత చేసినా గుర్తుండదు.. కానీ చివర్లో ఓటుకు ఇచ్చే రెండు వేల రూపాయిలు మాత్రం గుర్తుంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టని సంక్షేమ పథకాలను చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టింది. సుమారు 120 పథకాలకు పైగా ప్రవేశపెట్టింది. మానవ మేథస్సు అంతా ఫ్రెష్‌గా ఉండేది మాత్రమే ఆలోచన చేస్తుంది తప్ప.. పాతది ఆలోచన చేయట్లేదు. తిన్నాం.. అరిగిపోయింది.. ఏ రోజుకు ఆ రోజు అంతే. ఐదేళ్లు ఎంత చేసినా ప్రజలకు ఏమీ గుర్తుండదు.. ఎన్నికల ముందు రోజు చేసింది మాత్రమే గుర్తుండిపోతుంది.. అదే రెండు వేలు. చంద్రబాబు వందకు వంద శాతం మళ్లీ సీఎం అవుతారు* అని ఆయన చెప్పుకొచ్చారు.
గడచిన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు మెరుగైన సంక్షేమ పాలన అందించిందని, ఏకంగా 120 సంక్షేమ పథకాలను ప్రారంభించిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ సంక్షేమాన్ని గుర్తు పెట్టుకుని మరోమారు ఆ సంక్షేమాన్ని కొనసాగించిన పార్టీకే ఓటేయాలన్న భావనలో ప్రజలు లేరని కుండబద్దలు కొట్టారు. ఎన్నికల నాడు ఎవరు ఏమిచ్చారన్న దాని ఆధారంగానే ప్రజలు ఓట్లేస్తారని తేల్చేశారు. ఎన్నికల నాడు పార్టీలు పంచే రూ.2 వేలు మాత్రమే గుర్తుంచుకునే ప్రజలు... ఆ మేరకే ఓటు వేస్తారని చెప్పారు. అంటే... చంద్రబాబు అందించిన సంక్షేమ పాలనను ప్రజలు గుర్తుంచుకోలేదని ఒప్పేసుకున్న జేసీ... ఈ సారి కూడా టీడీపీనే గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చంద్రబాబు అందించిన సంక్షేమ పాలననను గుర్తుపెట్టుకోని ప్రజలు టీడీపీకే ఓటేశారని ఎలా చెబుతారో జేసీకే తెలియాలి అన్న వాదన వినిపిస్తోంది.