Begin typing your search above and press return to search.
జేసీ కథ ఇక ముగినట్టేనా ..?
By: Tupaki Desk | 21 Nov 2019 10:35 AM GMTజేసీ బ్రదర్స్ ... ఈ పేరు తెలియని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అనంతపురం జిల్లా రాజకీయాలని ఏకచ్ఛాద్రిపత్యంగా శాసించిన జెసి బ్రదర్స్ కథ ముగియబోతుందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అయన అనుచరుల నోటి నుండి కూడా ఇదే మాట వస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందంటే జెసి బ్రదర్స్.. టిడిపి అధికారంలో ఉంటే పరిటాల కుటుంబం అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించే వారు. కానీ , పరిటాల రవి మరణం తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.
2004-2014 మధ్య కాలంలో జెసి బ్రదర్స్ తమ కనుసన్నుల్లోనే జిల్లా రాజకీయాలను శాసించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలలో జెసి బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలో చేరాక కూడా జిల్లా మీద ఎంతో కొంత పట్టు కొనసాగించారు. ముఖ్యంగా తాడిపత్రి లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.
గత రెండు నెలలుగా జెసి ఆర్థిక మూలాలకు కేంద్ర బిందువైన దివాకర్ ట్రావెల్స్ బస్సులు ఒక్కటొక్కటే సీజ్ అవుతున్నాయి. దీని ఫలితంగా దివాకర్ ట్రావెల్స్ ఆల్ మోస్ట్ మూత పడే పరిస్థితికి వచ్చేసింది. ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడుల్లో పొలిటికల్ కోణం వుందని జెసి బ్రదర్స్ పలుమార్లు ఆరోపించారు. అలాగే ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు గుప్పించారు. ఒకానొక సందర్భంలో ఈ వ్యాపారాన్ని ఆపేస్తే ఏ సమస్య ఉండదు కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో జేసీ అనుచరులు ఒక్కొక్కరు టీడీపీ నుండి వైసీపీలోకి జంప్ అవుతూ వస్తున్నారు. అయన ప్రధాన అనుచరులుగా ఉన్న గోరా - షబ్బీర్ ఇటీవలే వైసీపీలో జాయిన్ అయ్యారు. ఇలా ఒకవైపు ఆర్థిక మూలాలు తరిగిపోతుండడం - మరోవైపు అనుచరులు ఎవరి దారి వారు చూసుకుంటూ వుండడం.. ఇంకో వైపు ముంచుకొస్తున్న వృద్ధాప్యం.. వీటన్నింటి ఒకసారి పరిశీలిస్తే .. అనంత రాజకీయాలలో జేసీ కథ ముగిసినట్టే అని ప్రచారం జరుగుతోంది.