Begin typing your search above and press return to search.
బాబుకు చెప్పి మరీ షాకిచ్చిన జేసీ
By: Tupaki Desk | 3 July 2019 7:11 AM GMTకేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసి ఏపీలో ఆ పార్టీని దెబ్బతీయడానికి వ్యూహాలు పన్నుతున్నారు. కొద్దిరోజులుగా అనంతపురం టీడీపీ నేతలతో టచ్ లో ఉన్న బీజేపీ తాజాగా చర్చలు మొదలు పెట్టడం విశేషం.
తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ తో కలిసి ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైనట్టు తెలిసింది. ఇక రాయలసీమకే చెందిన పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో సైతం సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
ఇక ఆపరేషన్ టీడీపీలో భాగంగా ఇప్పటికే ధర్మవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వరదాపూరం సూరిని బీజేపీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు జేసీని చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు జేసీ వారసుల రాజకీయ భవిష్యత్ పై స్పష్టమైన హామీ లభించినట్టు తెలిసింది. ఇక మిగిలిన టీడీపీ అనంతపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్పించే బాధ్యతను జేసీపైనే బీజేపీ పెట్టినట్టు తెలిసింది.
ఇక టీడీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయుడు పయ్యావుల కేశవ్ తోనూ బీజేపీ చర్చలు జరిపినట్లుగా సమాచారం. కేశవ్ బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్ ఇచ్చారట..కానీ ఆయన టీడీపీని వీడి వచ్చేందుకు సిద్ధంగా లేరట..
ఇక జేసీ ఫ్యామిలీతోపాటు అనంతపురం జిల్లాలో కీలకంగా ఉన్న పరిటాల ఫ్యామిలీని కూడా బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను జేసీకి అప్పగించినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓడిపోయిన వారు టీడీపీకి వీర విధేయులు . టీడీపీ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో వారు కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ నేతలతో సమావేశానికి ముందు ఆశ్చర్యకరంగా చంద్రబాబుతో గుంటూరులో సమావేశమయ్యారు. బీజేపీలో చేరుతున్నానని బాబుకు చెప్పి మరీ ఢిల్లీ వెళ్లారట జేసీ. మరి ఇదంతా చంద్రబాబు స్కెచ్ అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.