Begin typing your search above and press return to search.
పాలిటిక్స్ కు జేసీ గుడ్ బై..ఏమని చెప్పారంటే?
By: Tupaki Desk | 3 Jun 2019 2:13 PM GMTవివాదాస్పద కామెంట్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అనంతపురం తాజా మాజీ ఎంపీ - సీనియర్ పొలిటీషియన్ జేసీ దివాకర్ రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. తాజా ఎన్నికల్లో తన సీటులో తన కుామారుడిని - తమ్ముడి స్థానం అయిన తాడిపత్రిలో తమ్ముడి కుమారుడిని బరిలోకి దించిన జేసీ... ఎన్నికలకు ముందుగానే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసిన తర్వాత అమరావతి వచ్చిన జేసీ... ఎన్నికల్లో తమ కుమారుల గెలుపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామంటూ ప్రకటించి కలకలం రేపారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నా... యాక్టివ్ పొలిటీషియన్ గానే కొనసాగుతారన్న వాదన వినిపించింది.
అయితే జేసీ ఊహించినట్లుగా కాకుండా ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ఘన విజయం సాధించడంతో ఆయన షాక్ తిన్నారు. అప్పటిదాకా ఏ సందర్భం వచ్చినా జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడిన జేసీ.... ఇక తనకు ఇబ్బంది తప్పదేమోనన్న భయాందోళనలో కూరుకుపోయినట్టుగా విశ్లేషణలు వెలువడ్దాయి. ఇలాంటి తరుణంలో సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చిన జేసీ... రాజకీయాల నుంచి తాను స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జేసీ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలోనూ వైరల్ గా మారిపోయాయి.
ఇంతగా వైరల్ అయిన జేసీ కామెంట్లు ఎలా సాగాయన్న విషయానికి వస్తే... ‘నలభై ఐదేళ్లుగా రాజకీయ జీవితం గడిపా. అయితే ఇప్పుడు రాజకీయాల్లో నుంచి పూర్తిగా తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చా. రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టా. ప్రజల సంక్షేమానికి అదే విధంగా కృషి చేశా. నాకు సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకోవడంతోనే వైసీపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీతో నెమ్మదిగా వ్యవహరిస్తుండటమే ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి జగన్ కు సలహాలు - సూచనలు ఇచ్చేంత వ్యక్తిని కాను. ఆయనకు సలహాలు - సూచనలు ఇచ్చే వారు ఎందరో ఉన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమే. 2019లో టీడీపీ ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎదురొడ్డి నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీలో చేరతాననే ప్రచారంలో వాస్తవం లేదు. శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతున్నానన్న నిర్ణయమే ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ పై మాట్లాడేందుకు నేను చాలా చిన్నవాడిని. వాటిపై మాట్లాడేంత పెద్ద వాడిని కాదు. జగన్ మోదీల విజయం సునామీ లాంటిదే. జగన్ మా వాడే. నేనెప్పుడు జగన్ ను ధ్వేషించలేదు. రాజకీయంగా మాత్రమే విమర్శించా‘ అంటూ జేసీ తనదైన శైలికి భిన్నంగా మాట్టాడారు. జేసీ నోట వచ్చిన ఈ తరహా ప్రకటన ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయింది.