Begin typing your search above and press return to search.
జేసీ..బాబును కలిసిన తర్వాత ఎంత మారిపోయారో
By: Tupaki Desk | 27 Sep 2017 4:34 PM GMTతెలుగుదేశం పార్టీ నాయకుడు - క్రమశిక్షణ అనే పదానికి టీడీపీ డిక్షనరీ ప్రకారం ఉన్న నిర్వచనం మార్చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను సృష్టించిన రచ్చను ఎట్టకేలకు పక్కనపెట్టేశారు. గంబీరమైన పదాలతో అధికార పార్టీ ఎంపీననే విషయాన్ని కూడా పక్కనపెట్టేసి రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన జేసీ దివాకర్ రెడ్డి...ఏపీ సీఎం - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం అంతా సెటిల్ అయిపోయిందని చెప్పినట్లు సమచారం.
చాగల్లు రిజర్వాయర్ కు నీళ్లు ఇప్పించుకోలేకుంటే ఇక తాను ఎంపీగా ఉండి ఏం లాభమని - తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించడం ద్వారా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీన్ ఢిల్లీలో భేటీతో మారిపోయింది. ముస్సోరిలో యువ ఐఎస్ ఎస్ ల గెస్ట్ లెక్చర్ల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీలో పార్టీ నేతలు - పలువురు కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే పార్టీ నేతలతో కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు - పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు - ప్రత్యేక ప్యాకేజీ గురించి సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలు - మంత్రులతో చర్చించారు. ఈ భేటీ అనంతరం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ముచ్చటించినట్లు సమాచారం. ఈ సందర్భంగా నీటి విడుదల సహా అనంతపురం పార్లమెంటు పరిధిలో పలువురు నేతలతో ఉన్న గ్యాప్ గురించి సీఎం చంద్రబాబు - ఎంపీ జేసీ మధ్య ప్రత్యేక చర్చ సాగింది. అయితే ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన జేసీ వివాదం ముగిసిపోయిందని చెప్పినట్లు సమాచారం.
కాగా, ఈ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. కాకినాడ మెట్రో కెమికల్ కాంప్లెక్స్ - పోలవరం బకాయిలపై - ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదంపై అరుణ్ జైట్లీతో చర్చించారు. చంద్రబాబుతో పాటు సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి - మంత్రి ఉమామమహేశ్వరరావు - ఎంపీ సీఎం రమేష్ లు ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.