Begin typing your search above and press return to search.
ప్రత్యేకం రాదంట..డబ్బులే వస్తాయంటున్న జేసీ
By: Tupaki Desk | 8 Aug 2015 6:06 AM GMTసూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడే నేతల్లో ఒకరైన ఏపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా మీద కొద్దిరోజులుగా సాగుతున్న చర్చను జేసీ తన తాజా వ్యాఖ్యలతో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని తేల్చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ పట్ల సానుభూతి ఉందని.. కానీ.. ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం రాదని తేల్చేశారు. తాను ఏదో ఉత్త పుణ్యానికే ఈ మాటలు చెప్పటం లేదని.. ప్రధానమంత్రి మోడీ.. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో మాట్లాడిన సమయంలో.. వారి మాటలు విన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం అర్థమైందని చెప్పుకొచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాదని.. కాకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం డబ్బులిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీని ఆదుకోవాలన్న ఉద్దేశంలో కేంద్రం ఉందన్న విషయాన్ని జేసీ చెప్పారు. జేసీ లాంటి వ్యక్తే తేల్చి చెప్పేశాడంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇంక లేదన్న మాటే. ఇక.. కేంద్రం ఇచ్చే అరకొర నిధులతో సంతృప్తి చెందాలన్న మాట.