Begin typing your search above and press return to search.

జేసీ మాట‌.. రాజ‌కీయాల్లో క్యాస్టింగ్ కౌచ్‌!

By:  Tupaki Desk   |   26 April 2018 6:55 AM GMT
జేసీ మాట‌.. రాజ‌కీయాల్లో క్యాస్టింగ్ కౌచ్‌!
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్ని కొద్దిరోజులుగా ఊపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంపై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొన్న‌టికి మొన్న పార్ల‌మెంటులో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ రేణుకా చౌద‌రి వ్యాఖ్యానించి అంద‌రికి షాక్ తినేలా చేస్తే.. తాజాగా జేసీ మాట్లాడుతూ రాజ‌కీయాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌న్నారు.

అన్ని చోట్ల ఉన్న‌ట్లే రాజ‌కీయాల్లోనూ క్యాస్టింగ్ ఉంద‌న్నారు. అయితే.. పార్ల‌మెంటులో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న‌ట్లుగా త‌న‌కు తెలీద‌న్నారు. క్యాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేసీ.. ఏపీకి ఏమీ ఇవ్వ‌ని ప్ర‌ధాని మోడీ గురించి.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గురించి.. పోల‌వ‌రం.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో విజేత ఎవ‌రు? లాంటి ప‌లు అంశాల మీద మాట్లాడారు.

విష‌యాల వారీగా జేసీ వ్యాఖ్య‌లు చూస్తే..

ప్ర‌ధాని మోడీపై..

ఏపీకి ప్ర‌ధాని మోడీ ఏమీ ఇవ్వ‌ర‌న్న విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మూడున్న‌రేళ్ల క్రిత‌మే చెప్పా. ఆయ‌న ఏపీకి ఏమీ ఇవ్వ‌రు.

చంద్ర‌బాబుపై..

+ చంద్ర‌బాబు తెలివైన వ్య‌క్తి కాబ‌ట్టే కేంద్రంతో నాలుగేళ్లు క‌లిసి ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌న్న త‌ప‌న ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఒక్క‌రే ఆ ప‌ని చేయ‌లేరు.

+ చంద్ర‌బాబుకు మించినోళ్లు రాష్ట్రంలో ఎవరూ లేరు.

+ రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పాల‌న అత్య‌ద్భుతంగా ఉంద‌ని చెప్ప‌ను. కానీ.. చంద్ర‌బాబు కంటే బాగా పాలించే వారు మాత్రం ఎవ‌రూ లేరు.

+ బ‌యోమెట్రిక్ పెట్ట‌టంతో ఉద్యోగుల్లో ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త ఉంది. దాన్ని స‌వ‌రించ‌టానికి బాబు స‌న్న‌ద్ధంగా ఉండ‌టం సంతోషం.

+ సాయిబాబా మాదిరి చంద్ర‌బాబుకు మంత్రాలు.. మ‌హిమ‌లు లేవు.

పోల‌వ‌రం

పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌టానికి చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

బాబుకు అభివృద్ది చేయ‌టం.. ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌టం త‌ప్ప మ‌రో ఆలోచ‌న ఉండ‌దు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు..

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి తెలుగువారు ఎవ‌రూ ఓటు వేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నారు.