Begin typing your search above and press return to search.

పోతిరెడ్డిపాడుపై జ‌గ‌న్‌ కు జేసీ జై.. టీడీపీపై విమ‌ర్శ‌లు!

By:  Tupaki Desk   |   21 May 2020 9:30 AM GMT
పోతిరెడ్డిపాడుపై జ‌గ‌న్‌ కు జేసీ జై.. టీడీపీపై విమ‌ర్శ‌లు!
X
పోతిరెడ్డిపాడుపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఎంపీ - తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ దివాకర్‌ రెడ్డి జై కొట్టారు. ప్రాజెక్ట్ నిర్ణ‌యాన్ని ఆయ‌న సమర్థించారు. ఇక ఆ ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న మ‌రోసారి హాట్ టాపిక్‌ గా మారాయి.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు పై ప్ర‌భుత్వ నిర్ణ‌యం స‌మ‌ర్థిస్తూ సొంత పార్టీ టీడీపీపై విమ‌ర్శ‌లు చేశారు. విద్యుత్ బిల్లులు భారీగా వ‌స్తున్నాయ‌ని ఆరోపిస్తూ దీక్ష‌లు చేస్తున్న దానిపై స్పందించారు. టీడీపీ చేస్తున్న దీక్షల్ని ఆయ‌న తప్పుబట్టారు. ఇంట్లో ఉండి దీక్ష చేస్తే ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు దీక్ష ఎందుకు చేస్తున్నారో త‌న‌కు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇంట్లో ఉండి దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారా అంటూ సందేహం వ్య‌క్తం చేశారు.

గ‌తంలో అమరావతిలో 158 రోజులు దీక్ష చేస్తే ఒక్కరైనా స్పందించారా అంటూ జేసీ అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని గుర్తుచేస్తూ ప్ర‌శ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిదే రాజ్యం కాబట్టి.. టీడీపీ పై దాడులు చేస్తున్నారని.. రాక్షస రాజ్యంలో ఇంతకన్నా ఏం చూస్తామ‌ని లాస్ట్ పంచ్ వేశారు. ఈ విధంగా జ‌గ‌న్ పొగుడుకుంటూనే సొంత పార్టీని విమ‌ర్శించ‌డం జేసీ దివాక‌ర్‌ రెడ్డికి ఎప్ప‌టి నుంచే అల‌వాటు.