Begin typing your search above and press return to search.
టీడీపీ - జనసేన పాలిటిక్స్.. సహకార స్టోరీ ఇదీ
By: Tupaki Desk | 27 March 2019 6:32 AM GMTటీడీపీలో టైట్ అయ్యింది.. వైసీపీ నుంచి వలస వచ్చినవారు.. కాంగ్రెస్, బీజేపీలను వీడి వచ్చిన వారిని సర్దుబాటు చేశాక కూడా నాయకులు మిగిలిపోయారు.. ఏం చేయాలి.. పార్ట్ నర్ జనసేన పార్టీలోకి పంపించాలి.. పంపించారు సరే.. మరి జనసేన అభ్యర్థులు గా పాత టీడీపీ అభ్యర్థులు బలంగా నిలబడితే.. వారి వల్ల టీడీపీ అభ్యర్థుల ఓటమి ఖాయమైతే.. ఎలా.. అందుకే ఇప్పుడు ప్లాన్-బి ని అమలు చేస్తున్నారు. గుంతకల్ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న టీడీపీ-జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు ఆ రెండు పార్టీల అవగాహన ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం ఎంపీగా గడిచిన 5ఏళ్లు కొనసాగారు. ఆయన ఈసారి తన తనయుడు జేసీ పవన్ రెడ్డి కోసం వైదొలిగారు. కుమారుడి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో అనంతపురం పార్లమెంట్ పరిధిలోని గుంతకల్ సీటును తన అనుయాయుడు అయిన మధుసూదన్ గుప్తాకు ఇప్పించేందుకు ఆయన్ను బాబు సమక్షంలో టీడీపీలో చేర్చారు. కానీ సమీకరణాల వల్ల ఆయనకు చంద్రబాబు టీడీపీ గుంతకల్ టికెట్ కేటాయించలేదు. దీంతో జేసీ ప్లాన్ బి అమలు చేశారు. గుంతకల్ సీటుపై జనసేన నుంచి టికెట్ తెప్పించుకొని మధూసూదన్ గుప్తాను పోటీచేయించారు. నామినేషన్ వేశారు. కానీ ఇక్కడే సీన్ సితారైంది..
మధుసూదన్ గుప్తా గుంతకల్ బరిలో నిలవడంతో అక్కడ టీడీపీ అభ్యర్థి ఓడిపోయేలా పరిస్థితి తయారైంది. ఆ ప్రభావం.. అనంతపురం ఎంపీగా పోటీచేస్తున్న జేసీ పవన్ రెడ్డిపై పడుతోందట.. దీంతో కంగారెత్తిపోయిన జేసీ దివాకర్ రెడ్డి.. వెంటనే రంగంలోకి దిగి గుంతకల్ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తాను నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఒత్తిడి తెస్తున్నారట.. జేసీనే నిలబెట్టడంతో ఆయన విత్ డ్రా జరగడం ఖాయమని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
ఇలా తెలుగు దేశం రాజకీయంలో జనసేన ఓ పావుగా మారిందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.