Begin typing your search above and press return to search.
మోదీని, చంద్రబాబును ఇద్దరినీ దులిపేసిన జేసీ
By: Tupaki Desk | 1 Feb 2018 4:47 PM GMTబడ్జెట్ నేపథ్యంలో టీడీపీ ఎంపీలంతా కేంద్రాన్ని తప్పు పడుతుంటే అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విమర్శనాస్ర్తాలు సంధించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా టీడీపీ నాయకత్వం ఏమీ సాధించలేకపోయిందని ఆయన అన్నారు. బడ్జెట్ లో ఏపీపై బండను తీసి గుండు పెట్టినట్టుగా ఉందన్నారు. బడ్జెట్ ఎలా ఉందని మీడియా ఆయన్ను ప్రశ్నించగా... బాగుంది - మంచి ఇంగ్లీష్ వాడారు అంటూ ఎకసెక్కమాడారు.
జేసీ తీరు తెలిసిన మీడియా వ్యక్తులు కొందరు ఆయనకు తగ్గట్లుగానే... ‘‘చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా అని’’ అడగ్గా.. చంద్రబాబు అసలు తన టూర్లకు ఎంత ఖర్చు చేశారో తెలిస్తే దారి ఖర్చులు గిట్టుబాటయ్యాయో లేదో చెప్పొచ్చన్నారు. చంద్రబాబుకు నిదానం ఎక్కువని.. ఈ మధ్య నిదానం మరీ ఎక్కువైపోయిందని సెటైర్ వేశారు.
టీడీపీ ఎంపీలకు తెగింపు ఉంది కానీ, సమస్యంతా చంద్రబాబుతోనేనని... ఆయన ఆలోచిస్తూ కూచుంటారని, ఆయన నిదానం కారణంగా తాము నాలుగేళ్లలో ఏమీ సాధించలేకపోయామని అన్నారు. కేంద్రం తమను కరివేపాకుగానే చూస్తోందన్నారు. కేంద్రం ఇచ్చేది లేదు, చచ్చేది లేదు.. ఎంతకాలమైనా ఇంతే అన్నట్లుగా ఆయన తనదైన శైలిలో పెదవి విరిచేశారు. కేంద్రలో ఉండి రాష్ర్ట ప్రయోజనాల కోసం ఏమీ చేయలేని స్థితిలో ఉంటే ఇంకా పట్టుకుని వేలాడడం ఎందుకని మీడియా ప్రశ్నించగా ఆయన... జీతాలు పెంచకపోయినా మీరు మీ చానళ్లలోనే ఉంటారు కదా, మేమూ అంతే అంటూ బీజేపీ, టీడీపీ కాపురాన్ని కళ్లకు కట్టారు.