Begin typing your search above and press return to search.
చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడు : జేసీ
By: Tupaki Desk | 2 March 2019 11:41 AM GMTఅనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ స్వపక్షం, విపక్షం అని తేడా లేకుండా తప్పు చేసినా వారెవరైనా సరే ఏకిపారేసే జేసీ ఈసారి ఏకంగా తమ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్ చేయడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఎన్నికల్లో టీడీపీలో కనీసం 40శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడని జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. చంద్రబాబబు పరిస్థితి చూస్తుంటే మరోసారి గెలవడం కష్టమేనట్టు కనిపిస్తోందని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరులో తనకు చాలా అభ్యంతరాలున్నాయని.. టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనివల్లే టీడీపీ ఓడిపోతుందేమోనన్న భయం కలుగుతుందని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక జాతీయ రాజకీయాలపై కూడా జేసీ విశ్లేషించారు. పాకిస్తాన్ పై భారత్ దాడి దరిమిలా సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యిందని.. సరిహద్దుల్లో పరిస్థితులు ఇలాగే ఉంటే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని జేసీ జోస్యం చెప్పారు. నాకు తెలిసి గెలవడం కోసమే మోడీ ఇదంతా చేస్తున్నాడేమోనని జేసీ అనుమానం వ్యక్తం చేశారు.