Begin typing your search above and press return to search.
జగన్ పాలనను ప్రజలు ఇష్టపడుతున్నారు..జేసీ సంచలనం
By: Tupaki Desk | 22 March 2021 4:34 AM GMTచాలామంది నేతలను కంట్రోలు చేసినట్లు జేసీ దివాకర్ రెడ్డిని కంట్రోల్ చేయటం కష్టమే. తన మనసులో ఉన్నమాటను ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు అనే పేరున్న సీనియర్ నేత, మాజీ ఎంపి జేసీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు జగన్ పరిపాలను ప్రజలు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే పంచాయితిలో వైసీపీ మద్దతుదారులు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు అంతస్ధాయిలో గెలిచినట్లు కుండబద్దలు కొట్టకుండానే చెప్పటం విశేషం.
సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడుతు తాను మొదటినుండి చంద్రబాబునాయుడు ద్వేషినే అంటు పెద్ద బాంబుపేల్చారు. టీడీపీలో ఉంటునే ఆ పార్టీ అధినేతపై నోటికొచ్చినట్లు మాట్లాడే నేత ఎవరంటే జేసీ అని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. రాష్ట్ర విభజన సమయంలో తాము ఏ పార్టీలో చేరాలా ? అనే సమస్య వచ్చినపుడు జగన్మోహన్ రెడ్డికన్నా చంద్రబాబు నయమన్న ఉద్దేశ్యంతోనే తాము టీడీపీలో చేరినట్లు చెప్పారు. ఇపుడు కూడా వేరే దారిలేకే పార్టీలో కంటిన్యు అవుతున్నట్లు చెప్పారు.
మంచి చెడుల గురించి మాట్లాడుతు చంద్రబాబు మంచోడని తాము టీడీపీలో చేరలేదని వేరే గత్యంతరంలేకే చేరినట్లు అంగీకరించారు. గతంలో చాలా సార్లు చెప్పినట్లుగానే జగన్ మావాడే అంటు మళ్ళీ వెనకేసుకొచ్చారు. జగన్ రెండేళ్ళ పాలనను జనాలు మెచ్చారు కాబట్టే స్ధానిక ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టినట్లు అభిప్రాయపడ్డారు. అసైన్డ్ భూముల కుంభకోణంపై మాట్లాడుతు లీగల్ వ్యాలిడిటీ ఉంటే కానీ చంద్రబాబును రక్షించటం కష్టమన్నారు.
విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ ఆగేది కాదన్నారు. ఒకసారి ప్రధానమంత్రి నరేంద్రమోడి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రైవేటీకరణ ఆగదన్నారు. అలాగే మూడు రాజధానుల విషయంలో ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు-బీజేపీ కలిస్తేనే బాగుంటుందన్నారు. మొత్తానికి చంద్రబాబు, జగన్ పై జేసీ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి.