Begin typing your search above and press return to search.

షాకింగ్:రేపు జేసీ రాజీనామా!

By:  Tupaki Desk   |   19 July 2018 1:30 PM GMT
షాకింగ్:రేపు జేసీ రాజీనామా!
X
శుక్ర‌వారం జ‌ర‌గ‌బోతోన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు ముందు టీడీపీకి జేసీ మ‌రో షాకిచ్చారు. రేపు జ‌ర‌గ‌బోయే ఓటింగ్ లో పాల్గొన్న అనంతరం రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ - ఓటింగ్ జరిగిన తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని జేసీ ప్రకటించారు. రేపు లోక్ స‌భకు హాజ‌ర‌వుతాన‌ని జేసీ స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు, జేసీ అల‌క నేప‌థ్యంలో అనంతపురంలో రహదారుల విస్తరణకు రూ. 45 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరితో సీఎం చంద్రబాబు చర్చల అనంత‌రం ఈ జీవో విడుదల కావ‌డం విశేషం. ప్ర‌భాక‌ర్ చౌద‌రితో విభేదాల కార‌ణంగానే జేసీ అల‌క‌బూనార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, జీవో విడుద‌లైన‌ప్ప‌టికీ జేసీ రాజీనామా చేయాల‌నుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మ‌రోవైపు, జేసీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్ర‌భాకర్ అన్నారు. ఎంపీగా నియోజకవర్గమంతా తిరిగే అధికారం జేసీకి ఉందని ఏమైనా ఇబ్బందులుంటే త‌న‌తో చెప్పాలని ప్రభాకర్ చౌదరి చెప్పారు. కాగా, అనంతపురంలో రోడ్డు విస్తరణ నేప‌థ్యంలో ఈ ఇద్దరి మ‌ధ్య వివాదం చెల‌రేగింద‌ని తెలుస్తోంది. రోడ్ల విస్త‌ర‌ణ‌లో భాగంగా... ప్రార్థనా మందిరాలను తొలగించాలని జేసీ పట్టుబడుతున్నారు. అయితే, ప్రార్థనా మందిరాలను తొలగించవద్దని వాటి కమిటీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి. అయితే, క‌మిటీ స‌భ్యుల‌ను ప్రభాకర్‌ చౌదరే కోర్టుకు పంపించారని జేసీ మనస్తాపం చెందార‌ని తెలుస్తోంది. అంతేకాకుండా, ప్రభాకర్ చౌదరికి ఇచ్చిన విలువ తనకు ఇవ్వడం లేదని జేసీ గుర్రుగా ఉన్నారు. మ‌రోవైపు, టీడీపీ తీర్థం పుచ్చుకోవాల‌ని చూస్తోన్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాపై పార్టీ నాయకత్వం కూడా సానుకూలంగా ఉందని తెలుస్తోంది. కానీ, ఆయన చేరికను జేసీ వ్యతిరేకిస్తున్నారు. దాంతోపాటు, సీనియ‌ర్ అయిన త‌న‌కు పార్టీలో త‌గినంత ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌ని జేసీ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ కార‌ణాల దృష్ట్యానే జేసీ రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.