Begin typing your search above and press return to search.
రెడ్డి వర్సెస్ చౌదరి
By: Tupaki Desk | 21 Jan 2019 6:20 AM GMTపేరుకే ఇద్దరు ఒకే పార్టీ కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంది. వాళ్లిద్దరే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యై ప్రభాకర్ చౌదరి. గతంలో జేసీ కాంగ్రెస్ లో ఉండేవారు. అప్పట్లో జేసీకి, ప్రభాకర్ చౌదరికి అస్సలు పడేది కాదు. ఆ తర్వాత జేసీ టీడీపీలోకి వచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలోకి రావడం ప్రభాకర్ చౌదరికి అస్సలు ఇష్టం లేదు. ఈ విషయాన్ని బహిరంగంగానే ఖండించారు ఆయన. కానీ చంద్రబాబు చెప్పడంతో సైలెంట్ అయ్యారు. అయినా కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఇద్దరి మధ్య విభేదాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి జేసీపై ప్రభాకర్ చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తనపై జేసీ దివాకర్‌రెడ్డి అవాకులు చవాకులు పేలితే.. సహించేది లేదని స్పష్టం చేశారు. జేసీ అక్రమాల చిట్టా తన దగ్గర ఉందని హెచ్చరించారు.
ఇప్పుడు జేసీ, ప్రభాకర్ చౌదరి మధ్య విభేధాలు రావడానికి కారణం.. రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ జేసీకే వచ్చింది. దీంతో.. ఆయన పూర్తి చేశారు. పూర్తి చేశారు కదా అని ఈ బ్రిడ్జిని జేసీనే ప్రారంభోత్సవం చెయ్యాలని చూస్తున్నారనే అనుమానం స్థానిక ఎమ్మెల్యే అయిన ప్రభాకర్ చౌదరికి వచ్చింది. దీనికితోడు.. పీస్ మెమొరియల్ హాల్ కు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రభాకర్ చౌదరి అన్నారు. దీనిపై జేసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. టీడీపీలో వర్గపోరు ఇప్పుడు మరోసారి బయటకి వచ్చింది. జేసీ అక్రమాలకు సంబంధించిన లిస్ట్ తన దగ్గర ఉందని.. దీనిపై త్వరలో చంద్రబాబుని కలిసి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు ప్రభాకర్ చౌదరి.