Begin typing your search above and press return to search.
పరిటాల శ్రీరామ్‌ను ఆలింగనం చేసుకున్న జేసీ
By: Tupaki Desk | 10 Nov 2021 10:55 AM GMTతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఓ అరుదైన దృశ్యం కనబడింది. జేసీ ప్రభాకర్ రెడ్డి.. పరిటాల శ్రీరామ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేపీ ప్రభాకర్ రెడ్డి చేరుకున్నారు. అదే సమయంలో పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంలోనే ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. భుజాలపై చేతులు వేసుకుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఇద్దరూ టీడీపీ నాయకులే. కదా ప్రత్యేకత ఏముంది అంటే ఒక్కసారి ఈ రెండు కుటుంబాల గత చరిత్ర చూస్తే మాత్రం ఇది కచ్చితంగా ప్రత్యేక దృశ్యమే అని చెప్పాలి. ఒకప్పుడు అనంత జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. అప్పుడు జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవారు. పరిటాల రవి వర్సెస్ జేసీ బ్రదర్స్. ఓ రేంజ్ హైవోల్టేజ్ పాలిటిక్స్ నడిచేవి. అయితేపరిస్థితులు మారాయి. జేసీ బ్రదర్స్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు విభేదాలు కొనసాగినా గత కొన్ని రోజులుగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి.
పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్ ఆప్యాయంగా పలకరించుకోవడంతో ఇరు వర్గాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా పాలిటిక్స్ లో పరిటాల, జేసీ వర్గాలు బద్ధ శత్రువులుగా ఉండేవి. పరిటాల, జేసీ ఫ్యామిలీ ఓకే వేదిక మీదకు రావడం వల్ల మంచి మెసేజ్ ఇచ్చారని, ఇది శుభపరిణామం అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.