Begin typing your search above and press return to search.

మ‌ర్డ‌ర్ చేసినా..అనుచ‌రుల‌ను కాపాడాల్సిందే!

By:  Tupaki Desk   |   25 Jun 2018 9:54 AM GMT
మ‌ర్డ‌ర్ చేసినా..అనుచ‌రుల‌ను కాపాడాల్సిందే!
X
అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ రాజ‌కీయాల గురించి ఆ జిల్లాలో ర‌క‌ర‌కాల పుకార్లు ప్ర‌చారంలో ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని - ఆ జిల్లాలో జేసీ కుటుంబం చెప్పిందే వేద‌మ‌ని టాక్ ఉంది. రాబోయే ఎన్నిక‌ల్లో దివాక‌ర్ రెడ్డి త‌నయుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్నార‌న్న నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చానెల్ ...ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేసింది. ఆ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ రెడ్డి అనేక ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డించారు. త‌నపై ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌తాన‌న్న ముద్ర ఉంద‌ని - అది వాస్త‌వం కాద‌ని ప‌వ‌న్ రెడ్డి చెప్పారు. త‌న హిట్ లిస్ట్ లో ఎవ‌రూ లేర‌ని, రాయ‌లసీమ‌లో ఉన్న‌పుడు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు....రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఉండ‌డం స‌హ‌జ‌న‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. కొన్ని త‌రాల నుంచి త‌మ అనుచ‌రులు త‌మ‌ను న‌మ్ముకున్నారని - అటువంట‌పుడు అనుచ‌రులు చేసే మంచి చెడులు తామే చూసుకోవాల‌ని అన్నారు.

ఇపుడు తాడిప‌త్రి....దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ మునిసిపాలిటీగా అభివృద్ధి చెందింద‌ని అన్నారు. త‌మ‌కు ఆరు ద‌శాబ్దాలుగా ర‌క‌ర‌కాల వ్యాపారాలున్నాయ‌ని, అందుకే సంప‌న్న‌కుటుంబ‌మ‌ని చెప్పారు. ఎమ్మెల్యేగా...ఎంపీగా .....ప్ర‌మాణ స్వీకారంలో చెప్పేదే వేరు.... ప్రాక్టిక‌ల్ గా జ‌రిగేది వేర‌ని ప‌వ‌న్ అన్నారు. కొన్ని సంద‌ర్భాల్లో అనుచ‌రులు ఆవేశ‌ప‌డి....ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ర్డ‌ర్ చేసి వ‌చ్చినా ...వారిని కాపాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులుంటాయని చెప్పారు. త‌న తండ్రి దివాక‌ర్ రెడ్డి కూడా ప్రోత్స‌హించ‌లేదని, కానీ - సీమ‌లో రాజ‌కీయ‌ వాతావ‌ర‌ణం దృష్ట్యా ....అనుచ‌రులు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు చేయయ త‌ప్ప‌ని ప‌రిస్థితులున్నాయ‌ని అన్నారు. గ‌తంలో అవి మ‌రీ ఎక్కువ‌ని, కానీ చాలాకాలంగా అవి స‌మ‌సిపోయాయ‌ని చెప్పారు. సూర్య‌ప్ర‌తాప్ రెడ్డి....హ‌త్య‌తో త‌మ‌కు సంబంధం లేదని, కానీ, త‌మ కుటుంబంపై క‌క్ష్య‌తో త‌న‌ను ఏ వ‌న్...గా పెట్టార‌ని చెప్పారు. ఆ హ‌త్య జ‌రిగిన రోజు అజ‌హ‌రుద్దీన్ తో తాను సినిమా చూస్తున్నాన‌ని...ఆయ‌న కూడా వ‌చ్చి ఇదే విష‌యం పోలీసుల‌కు చెప్పారని తెలిపారు. ఒక పక్క రాజ‌కీయం....మ‌రోప‌క్క రాజీ ప్ర‌య‌త్నాలు.....వంటివి చేసే అవ‌స‌రం లేదని ప‌వ‌న్ అన్నారు. గ్రామాల్లో ప్ర‌జ‌లు వారంత‌ట‌వారే రాజీకొస్తార‌ని.....రాజీలు చేయ‌క‌పోతే....గొడ‌వ‌లు ఎక్కువ‌వుతాయి....కాబ‌ట్టి ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటాయ‌ని చెప్పారు.

ప‌రిటాల ర‌వి హ‌త్య‌తో జేసీ దివాక‌ర్ రెడ్డికి సంబంధం లేదని......ఆనాడు కూడా జేసీ భ‌య‌ప‌డ‌లేద‌ని.....ఆనాటి ప‌రిస్థితులు దృష్ట్యా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ పెట్ట‌లేదని చెప్పారు. త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాణ‌హాని ఉంద‌ని...రాజ‌కీయ‌, ఫ్యాక్ష‌న్ హ‌త్య‌లు ఎక్కువ‌గా ఉన్నాయి కాబ‌ట్టే అలా చేశామ‌ని చెప్పారు. శ్రీ‌రామ్ కు నాకు విభేదాలు లేవని, ముఖ ప‌రిచయం ఉంద‌ని - ప‌రిటాల శ్రీ‌రామ్ పెళ్లికి పిల‌వ‌లేదు కాబ‌ట్టి వెళ్ల‌లేదని చెప్పారు. పార్టీకోసం తాను క‌ష్ట‌ప‌డుతున్న తీరు లోకేష్ కు న‌చ్చి ఉండ‌వ‌చ్చని, అందుకే లోకేష్ కోట‌రీలో శ్రీ‌రామ్ క‌న్నా ప‌వ‌న్ కు ప్రాముఖ్య‌త ఎక్కువ అనే టాక్ వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాము టీడీపీని వీడ‌బోమ‌ని - గెలిచే అభ్య‌ర్థుల‌కు టీడీపీ టిక్కెట్లు ఇస్తుంద‌ని,అందుకే త‌మ కుటుంబంనుంచి ముగ్గురికి టిక్కెట్లు ఆశిస్తున్నామ‌ని చెప్పారు. జ‌గ‌న్ త‌న‌కు చిన్న‌ప్ప‌టి నేస్తం అని, అయితే, ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాలు, కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల కొద్దిగా గ్యాప్ వ‌చ్చిందని అన్నారు. ద‌బంగ్-3 ఫంక్ష‌న్ లో తాను సల్మాన్ ను క‌లిశానని, అక్క‌డ జ‌గ‌న్ ఉన్నారని చెప్పారు. స్పోర్ట్స్ అంటే ఆస‌క్తి అని, త‌న‌కు టీమిండియా క్రికెట‌ర్లు మొత్తం తెలుసని అన్నారు. ఒలింపిక్ అసోసియేష‌న్ ప‌ద‌వి త‌న‌కు కావాల‌ని మాత్ర‌మే చెప్పాన‌ని, గ‌ల్లా, సీఎం ర‌మేష్ ల వివాదంతో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పారు. లంచం కూడా చెక్ రూపంలో తీసుకుంటార‌నే టాక్ అబ‌ద్ధ‌మ‌ని,..... కాంట్రాక్టర్ల ద‌గ్గ‌ర క‌మీష‌న్లు తీసుకోవ‌డం లేద‌ని, తాడిప‌త్రి అభివృద్ధి కోసం వారు త‌మ‌కు తోచింది చేస్తున్నారని చెప్పారు. ప్ర‌జ‌ల‌ను త‌న బాబాయ్ ప్ర‌భాక‌ర్ రెడ్డి బెదిరిస్తున్నారన్న వాద‌న‌లో నిజం లేద‌ని, కొద్దిగా భ‌యం లేకుంటే....ప‌నులు జ‌ర‌గ‌వని చెప్పారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు తీర్చ‌మ‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి ద‌గ్గ‌ర‌కు వ‌స్తార‌ని, వారు పోలీసు స్టేషన్ కు వెళితే త‌మ‌కు కూడా రిస్క్ త‌గ్గుతుందని ప‌వ‌న్ అన్నారు. రాబోయే ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రుగుతాయ‌ని భ‌రోసా ఇచ్చారు.