Begin typing your search above and press return to search.
అనంతలో జేసీ బ్రదర్సు హల్ చల్
By: Tupaki Desk | 7 April 2016 9:37 AM GMTతాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కంప్లయింట్లు పెరిగిపోతున్నాయి. తాజాగా టీడీపీ నేతలే ఆయనపై కంప్లయింటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటూ... అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్య అనుచరుడు - అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా త్వరలోనే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి కూడా ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా అనంతపురంలో జేసీ బ్రదర్సు దెబ్బకు ఇబ్బందులు పడుతున్నామని టీడీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా అనంతపురంలో తమకు అడ్డుగా ఉన్న నేతలను టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదవి వర్గంలో జేసీ బ్రదర్సు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో గతంలోనూ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి జేసీ ప్రభాకరరెడ్డి ఫోన్ చేసి బెదిరించినట్లుగా చెబుతున్నారు. అనంతపురంలో జేసీ బ్రదర్సు ఒక వైపు.... ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి - మేయర్ స్వరూప చౌదరి ఒకవైపు ఉంటూ వర్గపోరు సాగిస్తున్నారు. ప్రభాకర చౌదరి వర్గానికే చెందిన డిప్యూటీ మేయర్ గంపన్నకు ప్రభాకరరెడ్డి ఫోన్ చేసి... ‘‘అనంతపురంలో మీ కథంతా ఇక నేను పట్టించుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యమేమీ కాదు. ఇకపై ప్రతిచోటా నేనుంటా’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారట. దాన్ని రికార్డు చేసిన గంపన్న పోలీసులకు ఆ కాల్ రికార్డులు ఇచ్చారు.
ఇక ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరితే ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంతకుముందు కూడా ప్రభాకరరెడ్డి రచ్చరచ్చ చేశారు. తన గన్ మేన్లను వెనక్కు పంపించి కొద్దికాలం అప్ స్కాండ్ అయ్యారు. అయితే, గవర్నమెంటు పట్టించుకోకపోవడంతో అన్న దివాకరరెడ్డి ఎంటరై తన తమ్ముడు దక్షిణాఫ్రికా వెళ్లారంటూ కవర్ చేసి ఇష్యూ సద్దుమణిగేలా చేశారు.