Begin typing your search above and press return to search.

నన్ను బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టాడు : జేసీ దివాకర్ రెడ్డి !

By:  Tupaki Desk   |   13 Jun 2020 6:15 AM GMT
నన్ను బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టాడు : జేసీ దివాకర్ రెడ్డి !
X
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్ ‌పై మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి స్పందించారు. ప్రభాకర్‌రెడ్డి పై ఆరోపణలు నిజమేనని.. అస్మిత్‌ రెడ్డికి ఏమీ తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. అరెస్ట్‌ లను కోర్టుల్లో ఎదుర్కొంటామని, నేరం చేయకున్నా వైఎస్సార్ ‌సీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించగలదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందనే చంద్రబాబు, లోకేష్‌ను అరెస్ట్ చేయడం లేదన్నారు జేసీ. వైఎస్సార్ ‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు జోలికి వెళ్తే రాష్ట్రం అల్లకల్లలోం అవుతుందని.. చంద్రబాబు వెంట ఉంటున్నవారిని అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురిచేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమన్నారు.

ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అని , ఏసు ప్రభు చెప్పినా వినే పరిస్థితిలో జగన్ లేడని, జగన్‌ ను కంట్రోల్ ‌లో పెట్టడం ప్రధాని నరేంద్రమోదీ తోనే సాధ్యమవుతుందని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. అలాగే, ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు నడుములు విరిగిపోయి వారు ఏమీ చేయలేక పోతున్నారని, తమ్ముడి అరెస్టు పై తాను ఏమీ మాట్లాడబోనన్నారు. అరెస్టుకు నిరసనగా ఎలాంటి కార్యక్రమ ప్రణాళిక లేదన్నారు.

"నేను నిజం చెబుతున్నా నాకు ఎన్ని లారీలు ఉన్నాయో.. ఎన్ని బస్సులు ఉన్నాయో నాకే తెలియదు. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఈ ప్రభుత్వం దేనికి అయినా తెగిస్తుంది. దీనికి రూల్స్ లేవు, రెగ్యులషన్స్ లేవు. చట్టం లేదు. రాజు తలచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్లు ఉంది ఈ పరిస్థితి. ఏమీ చేయలేం. కోర్టుకు వెళ్లాల్సిందే. చీఫ్ సెక్రటరీ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. జగన్ సర్వశక్తి సంప్పన్నడు. ఆయనే అల్లా, ఆయనే ఏసు, ఆయనే తిరుపతి వెంక్కన. తన మాటకు ఎదురు చెప్పేవాడు, తనకు ప్రతి పక్షంలో ఎవరు లేకుండా చేయడమే తన ధేయం అన్నట్లుగా ఉంది జగన్ పాలన. జగన్ దగ్గర మంచి అధికారులు ఉన్నా వారి మాట చెల్లుబాట అయ్యేటట్లు లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట కూడా వినే పరిస్థితిలో జగన్ లేడు. నన్ను నడిరోడ్డులో బట్టలు లేకుండా నిలబెట్టాడు.. నా ఆర్థిక మూలాలు లేకుండా చేశాడు. నన్ను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.