Begin typing your search above and press return to search.

సీరియ‌ళ్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు:జేసీ ప్ర‌భాక‌ర్

By:  Tupaki Desk   |   6 Oct 2018 9:01 AM GMT
సీరియ‌ళ్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు:జేసీ ప్ర‌భాక‌ర్
X
అనంతపురం రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్‌ కు త‌మ‌దైన గుర్తింపు ఉంది. వారిద్ద‌రూ త‌మ వ్యాఖ్య‌ల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. త‌మ దూకుడుతో త‌మ‌దైన కామెంట్ల‌తో వివాదాల్లో నిలుస్తుంటారు. అనంత‌పురంలో పోలీసు వ్య‌వ‌స్థ‌పై జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌బోధానంద స్వామి ఆశ్ర‌మం-దాడి వ్య‌వ‌హారంలోనూ జేసీ తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి....టీవీ సీరియ‌ళ్ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీరియ‌ళ్ల వ‌ల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. అస‌లు సీరియ‌ళ్ల‌లో నీతి లేద‌ని, ధ‌నార్జ‌నే ధ్యేయంగా సీరియ‌ళ్లు తీస్తున్నార‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలోని జేసీ నాగిరెడ్డి షాదీఖానాలో జరిగిన దుల్హన్ పథకం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జేసీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం టీవీ సీరియ‌ళ్ల వ‌ల్ల ఏ మాత్రం ప్ర‌యోజ‌నం లేద‌ని, డ‌బ్బు సంపాదించ‌డ‌మే ధ్యేయంగా సీరియల్స్ తీస్తున్నారని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఆ సీరియ‌ళ్ల వల్ల జనాలకు ఎటువంటి ప్రయోజనం లేద‌ని అన్నారు. కుటుంబాల్లో అసూయ - ఈర్ష్య - ద్వేషాలు - పగ - ప్రతీకారాలను సీరియ‌ళ్లు రెచ్చగొడుతున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మానవ సంబంధాలు - కుటుంబ విలువలు తగ్గిపోయేలా సీరియల్స్ నిర్మిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జేసీ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇళ్ల‌లో మ‌హిళ‌లు సీరియ‌ళ్లు చూడాలా వ‌ద్దా అన్న‌ది వారి వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయినా, దుల్హ‌న్ ప‌థ‌కం ప‌త్రాల పంపిణీకి వ‌చ్చిన జేసీ....సీరియ‌ళ్ల‌పై లెక్చ‌ర్ ఇవ్వ‌డం ఏమిట‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. త‌న అభిప్రాయాల‌ను అంద‌రు మ‌హిళ‌ల‌పై రుద్ద‌డం స‌రికాద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సీరియ‌ళ్లపై జేసీ మోరల్ పోలీసింగ్ స‌రికాద‌ని అనుకుంటున్నారు.