Begin typing your search above and press return to search.
ఆయన ఎంత మగాడో మాకు తెలుసు: జేసీ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 24 Dec 2020 12:59 PM GMTఅనంతపురంలో ఫ్యాక్షన్ మరోసారి పడగవిప్పింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ఫ్యామిలీ గొడవ తాడిపత్రిలో ఘర్షణలకు దారితీసింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం ఈరోజు జేసీ ఫ్యామిలీపై దండెత్తి ఘర్షణకు దిగారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్యకు సంబంధించిన ఆడియో వైరల్ చేశారని ఈ గొడవ జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఈ వివాదంపై తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘తాము లేనప్పుడు ఎవరైనా వస్తారా? ఆయనెంత మగాడో తెలుసు.. ఎవరూ లేనప్పుడు ఇంటికి వచ్చారు’ అని నిప్పులు చెరిగారు. తప్పు పోలీసులదేనని.. ఆయన కోసం పోలీసులే పరిగెత్తుకుంటూ వచ్చి నా ఇంటి గేట్ తీశారు. కొడవలితో నా ఇంట్లోకి వెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయను. సీసీ ఫుటేజీ తీసి సుమోటోగా కేసు పెట్టండి.. ఇసుక దొరకలేదని చెప్పినోడే వైరల్ చేశాడు’ అని జేసీ దివాకర్ రెడ్డి గొడవపై వ్యాఖ్యానించారు.
ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవని జేసీ అన్నారు. పోలీసుల తీరు మారాలని.. ఇలాగే ఉంటే ప్రజలకు రక్షణ ఉండదని వ్యాఖ్యానించారు.ఉద్దేశ పూర్వకంగా తమపై దాడులు చేస్తున్నారని జేసీ ఆరోపించారు. పోలీస్ అధికారుల పిల్లలకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉండదని అన్నారు.
ఈ మధ్యాహ్నం ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనచరులు వాహనాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. జేసీ ఇంట్లో ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు భారీగా రాళ్లదాడి చేసుకున్నాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురి తలలు పగిలాయి.దీనిపై తాజాగా జేసీ తీవ్రంగా స్పందించారు.