Begin typing your search above and press return to search.

రఘువీరాకు చెమట పట్టించాడు..

By:  Tupaki Desk   |   22 Jun 2015 4:59 PM IST
రఘువీరాకు చెమట పట్టించాడు..
X

అనంతపురంలో జేసీ బ్రదర్స్ సంగతి తెలియనివారు లేరు... బుర్రలో ఏం తోస్తే అది మాట్లాడేస్తారు... ఎదురుగా ఎవరున్నా సరే నిర్మొహమాటంగా మాట విసరడంలో వారికి వారే సాటి.. టీడీపీ ఎంపీ జేసే దివాకరరెడ్డి ఈ విషయంలో ఎంత స్పీడో తెలిసిందే... ఆయన తమ్ముడు తాడిపత్రి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే టైపు. సోమవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని ఉలిక్కిపడేలా చేశారు.

జేసీ ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీఅధ్యక్ష పదవి పోయాక రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారనిసంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే కాంగ్రెస్ నేతలు ఒక్కరొక్కరుగా జారిపోతున్న తరుణంలో పీసీపీ అధ్యక్షుడిగా ఉన్న తనపైనే ఈ రేంజిలో ఆరోపణ చేయడంతో రఘువీరా రెడ్డి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతేకాదు... ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకుకాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. మొత్తానికి చిన్న జేసీ దెబ్బకు రఘువీరాకు చెమటలు పట్టాయి. ఈ విషయం అధిష్ఠానానికి తెలిస్తే ఉన్న ఈ కాస్త పదవి ఊడుతుందేమోనన్నది ఆయన భయం.