Begin typing your search above and press return to search.
జేసీని జైల్లో పెట్టింది ఇద్దరే..నాడు ఎన్టీఆర్..నేడు జగన్!!
By: Tupaki Desk | 7 Aug 2020 12:10 PM GMTజేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయ్యి 54 రోజుల జైలు జీవితం తరువాత బెయిల్ పై విడుదలయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాగానే సొంత ఇలాకా తాడిపత్రిలో పెద్ద ర్యాలీ తీసి హల్ చల్ చేశారు. ఓ పోలీసును బెదిరించగా కేసు నమోదైంది.
ఇక వచ్చీరావడంతోనే తనను అరెస్ట్ చేయించిన సీఎం జగన్ పై పడ్డారు. తన జీవితంలో తనను అరెస్ట్ చేయించింది కేవలం ఇద్దరేనని.. ఒకటి గతంలో ఎన్టీఆర్ అయితే.. ఇప్పుడు జగన్ అని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు. ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు జైలు జీవితం గడిపానన్నారు. ఇప్పుడు 54 రోజులు ఉన్నానన్నారు.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఏజెంట్లు తమను మోసం చేశారని.. నాగాలాండ్ రూల్స్ వేరే ఉన్నాయని అదే గందరగోళానికి కారణమని జేసీ అభిప్రాయపడ్డారు. మా బస్సులన్నీ ఆపేశారని.. తిప్పే పరిస్థితి ఏపీలో లేదన్నారు..
ఇక తాను జైల్లో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యే నిఘా పెట్టారని.. జైల్లోనే ఇబ్బందులు పెట్టేలా బయట నుంచి ప్రయత్నించారని జేసీ అన్నారు. కరోనాతో జైల్లోనే చంపేయాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. 68 ఏళ్ల తనను జైల్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని.. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీ అన్నారు. తాడిపత్రిలో తాను విడుదలైతే మహిళలు వచ్చి మరీ మంగళహారతులు ఇచ్చారని ఇది తమపై అభిమానం అని చెప్పుకొచ్చారు.
ఇలా వీరావేశంతో జేసీ ప్రభాకర్ రెడ్డి చెలరేగిపోయారు. సీఎం జగన్ సహా పలువురు ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.