Begin typing your search above and press return to search.
బాబుకు చెబుతున్నా...వైసీపీకి అదే శిక్ష...జేసీ హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 11 May 2023 2:51 PM GMTరాజకీయాలు అంటే రాజకీయాలుగానే చేయాలి. ఒకరి మీద ఒకరు పగ పట్టినట్లుగా కేసులు పెట్టుకుంటూ పోటే ఈ ప్రతీకారం ఎప్పటికీ తీరదు. ఎన్ని జనలెత్తినా ఈ కేసులు కూడా వీడవు. ఇదీ అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి రేపు టీడీపీ పవర్ లోకి వస్తే వైసీపీని క్షమించేయాలనే కోరుకుంటాను అంటున్నారు తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి.
విజయవాడ లో ప్రజా ప్రతినిధుల కోర్టు కేసుకు విచారణ కోసం గురువారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన మీద ఏకంగా 78 కేసులు ఉన్నాయని, అందులో ఏ కేసు విచారణకు ఇపుడు పిలిచారో తెలియదు అంటున్నారు జేసీ. జేసీ బ్రదర్స్ గతంలో ఇతర రాష్ట్రాలలో వాహనాలకు చేసిన రిజిస్ట్రేషన్‌ల వ్యవహారం మీద నమోదైన కేసుకు సంబంధించి కోర్టుకు విచారణకు వచ్చినట్లుగా తెలిసింది.
అయితే ఈ సందర్భంగా జేసీ ప్రభాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కేసులు పెట్టుకుంటూ పోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఎవరూ మిగలరు అని అన్నారు. అంతా కలసి కోర్టుకు రావాల్సిందే అని అన్నారు ఇక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సఫర్ కావాల్సి ఉంటుందని కూడా జేసీ అంటున్నారు.
వారి పిల్లలకు కూడా ఇబ్బందులు వస్తాయని రేపటి రోజున వారి కుటుంబం నుంచి మరొకరు ఐపీఎస్, ఐఏఎస్ అయ్యే అవకాశం కూడా లేకుండా బాధపడతారు అని అన్నారు. అసలు ఇదంతా అవసరమా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలు చేయాలనుకుంటే అలాగే చేయాలి తప్ప ప్రతీకారాలు పగలు ఉండరాదు అని ఆయన అంటున్నారు.
అలా పెంచుకుంటూ పోతే అవి ఎక్కడా ఆగేవి కాదు అని అన్నారు. రేపటి రోజున తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కేసులు నేను అయితే వైసీపీ వారి మీద తిరిగి పెట్టను అని ఆయన ఒట్టేసారు. అంతే కాదు మా వారి చేత కూడా కేసులు పెట్టించను అన్నారు. ఇక చంద్రబాబు ఇదే విషయం మీద మాట్లాడుతున్నారని, మేము వచ్చాక అని హెచ్చరిస్తున్నారని, అది మంచిది కాదని ఆయన అంటున్నారు.
అందువల్ల చంద్రబాబుకు ఇదే తాను చెబుతాను అని ప్రజలకు మంచి చేయడానికే చంద్రబాబు లాంటి నాయకులు చూడాలి తప్ప కేసులు ప్రత్యర్ధుల మీద పెట్టకూడదనే తాను కోరుకుంటాను అని జేసీ మాట్లాడారు. కేసులు పెడితే ఎమొస్తుంది, పగ పెరుగుతుంది కానీ అదే క్షమించి వదిలేస్తే మాత్రం వారికి తగిన శిక్ష పడుతుందని, అదే అసలైన గుణపాఠం అవుతుందని జేసీ చాలానే చెప్పారు.
ఏపీలో చూస్తే టీడీపీ నాయకులు మేము అధికారంలోకి వస్తే వైసీపీని వారిని వదలమని ఇంతకు ఇంత రెట్టింపుగా మా రివెంజ్ ఉటుందని అంటున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి లాంటి వారు అయితే అదంతా తప్పు అని అంటున్నారు. మరి జేసీ మాటను బాబు వింటారా. అసలు క్యాడర్ అలా వైసీపీని వదిలేస్తే ఊరుకుంటుందా. ఏది ఏమైనా జేసీ ప్రభాకరరెడ్డి మంచి మాటలే చెప్పరని అంటున్నారు.
అంతే కాదు తాను జైలుకు భయపడను కేసులను అసలు భయపడను, ఎన్ని అయినా పెట్టుకోండి అంటూ ఆయన చెబుతున్నారు. తాను మాత్రం వైసీఎపీ వారి మీద కక్ష సాధించను అంటూ ఆయన కొత్త రకం పాలిటిక్స్ ని తీసుకున్నారు. చూడాలి మరి దీని వల్ల ఏమి జరుగుతుందో. ఏపీ రాజకీయాల్లో ఏమైనా మార్పులు వస్తాయో ఏమో అన్నది.