Begin typing your search above and press return to search.
జేసీ స్వాతంత్య్ర సంబరాలు.. కేక్ కట్ చేసి.. రీజనేంటంటే!
By: Tupaki Desk | 24 Dec 2021 4:30 PM GMTఫీడం డే! అంటే.. స్వాతంత్య్రం వచ్చిన రోజు. అయితే.. వాస్తవానికి మనకు స్వాతంత్య్రం వచ్చినరోజు అంటే.. ఆగస్టు 15న నిర్వహిస్తాం. ఆ రోజు కేకులు కట్ చేసుకుంటాం.. జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తాం.. సంబరాలు చేసుకుంటాం. అయితే.. ఇప్పుడు అచ్చు ఇలాంటి స్వతంత్య్ర దినోత్సవమే తనకు వచ్చిందని అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్‌లో ఫైర్ బ్రాండ్ అయిన.. ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ఉన్నారు. తాజాగా ఆయన ఫ్రీడం డే నిర్వహించారు.
మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. దీనికి జేసీ చిత్రమైన సంగతి చెప్పారు. అదేంటంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు వైసీపీ నాయకుడు, తాడిపత్రి ఎమ్మెల్యే.. జేసీ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి అయిన.. కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేరుగా జేసీ ఇంటికే తన అనుచరులతో వచ్చి..వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు.. అక్కడే ఉన్నకుర్చీలో కూర్చుని.. హల్చల్ చేశారు. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. దాదాపు 15 రోజుల పాటు తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. అయితే ఈ సంఘటన తరువాత టీడీపీ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు.
జేసీ ఫ్యామిలీకి అండగా ఉన్నారు. ఈ క్రమంలో తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే.. ఒక్క తాడిపత్రిలో మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది. ఆ రోజు జరిగిన సంఘటన కారణంగానే తమ కార్యకర్తలు భయం వీడి.. మనో ధైర్యంతో ముందు కు వచ్చారని, దానికి గుర్తుగా ఫ్రీడమ్ డే సంబరాలు చేసుకున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇంకా వింత ఏంటంటే.. ఈ వివాదానికి కారణం ఇసుక కావడంతో.. ఒక కేక్‌పై ఇసుక బండి వేయించారు. ఆ కేక్‌ను అభిమానులు, కార్యకర్తల సమక్షంలో జేసీ కక్ కట్ చేశారు. అనంతరం ఇంటి వద్ద బాణా సంచా కాల్చారు. అలాగే విందుభోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుక ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఫ్రీడం మున్ముందు.. ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.