Begin typing your search above and press return to search.
ఈడీ తన ఆస్తులను అటాచ్ చేయడంపై జేసీ హాట్ కామెంట్స్ వైరల్!
By: Tupaki Desk | 1 Dec 2022 12:30 PM GMTతన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేయడంపై అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేసి.. వాటికి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిపించి.. వాటిని బీఎస్ 4 వాహనాలుగా మార్చి విక్రయించారని జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. రూ.38 కోట్ల మేర అక్రమ లావాదేవీలు లారీల పేరుతో జరిపినట్లు ఈడీ నిర్దారించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ తన ఆస్తులు ఎటాచ్ చేయడంపై ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. తనకు ఈడీ రూపంలోనే దేవుడు ఉన్నాడన్నారు. ఈడీ తీసుకున్న నిర్ణయంతో తనకు సంతోషంగా ఉందన్నారు. అన్ని వాస్తవాలు ఈడీ విచారణలో వెలుగులోకి వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశమని జేసీ ప్రభాకరరెడ్డి Ðð ల్లడించారు. ఇందులో అసలు తమకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్‌ను ఎందుకు విచారించలేదని నిలదీశారు. త్వరలోనే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
ఎవరి పాత్ర ఏమిటో అని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తమకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్‌ను విచారించాలన్నారు. నాగాలాండ్ అధికారులను విచారించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆర్టీవో, పోలీసు అధికారులు కూడా విచారణ ఎదుర్కోక తప్పదని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. ఇందులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండేనని తెలిపారు.
కాగా బీఎస్ వాహనాల రిజిస్ట్రేషన్‌లో జేసీ ప్రభాకర రెడ్డితో పాటుగా ఆయన సన్నిహిత కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డికి చెందిన రూ 22.10 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. దివాకర్ రెడ్డి లైన్స్, జటధార ఇండస్ట్రీస్, సీ గోపాల్ రెడ్డి అండ్ కో పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.