Begin typing your search above and press return to search.
వైఎస్ ను అంత మాట అనటమా? ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా?
By: Tupaki Desk | 5 July 2021 11:30 AM GMTసంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఏపీ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు కమ్ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ నడుస్తున్న వేళలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేస్తే.. అంతకు మించి అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ నోరు పారేసుకున్నారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ నరరూప రాక్షసుడని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు తప్పుపట్టారు. ఘాటుగా రియాక్టు అయ్యారు. విస్మయానికి గురి చేసే అంశం ఏమంటే.. వైఎస్ ను అంత మాట అన్నప్పటికి.. ఏపీ మంత్రులు ఎవరూ పెదవి విప్పకపోవటం షాకింగ్ గా మారింది.తరచూ తమ రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా విరుచుకుపడే వైసీపీ నేతలు.. వైఎస్ మీద అంత ఘాటు మాట అన్నాక మౌనంగా ఉండటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం.. మిగిలిన అంశాల్ని పక్కన పెట్టేసి.. తన తండ్రి మీద అంత మాట అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద విరుచుకుపడతారని.. మిగిలిన టీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించి ఉంటే బాగుండేదని వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున కోరుకున్నారు. తమ భావాల్ని సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదన్న విమర్శ ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా జేసీ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెలరేగిపోయారు. దివంగత నేత వైఎస్ లాంటి వ్యక్తిని పెట్టుకొని నరరూప రాక్షసుడని పేర్కొనటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడని.. గుర్తు చేశారు. వైఎస్ లాంటి మనిషిని బండ బూతులు తిడుతుంటే ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించిన ఆయన.. వైఎస్ ను అన్నేసి మాటలు అంటుంటే ఏపీ మంత్రులు తమ చేతలకు పని చెప్పకుండా గాజులు వేసుకున్నారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ సెటిలర్స్ కారణంగా తాను ఎక్కువ మాట్లాడలేకపోతున్నట్లుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని జేసీ బ్రదర్ తప్పు పట్టారు. హైదరాబాద్ లో సెటిలర్స్ ఎవరిని ఆయన ప్రశ్నించారు. తన కొడుకు హైదరాబాద్ లో పుట్టాడని.. అక్కడే చదువుకున్నారని.. అలాంటప్పుడు వారుసెటిలర్స్ ఎలా అవుతారని క్వశ్చన్ చేశారు. అమెరికాలో పిల్లలు పుడితే.. అక్కడి పౌరసత్వం ఇస్తారని.. అలాంటప్పుడు తెలంగాణలో పుట్టి.. పెరిగిన వారు అక్కడి వారు కాకుండా సెటిలర్స్ ఎలా అుతారని ప్రశ్నిస్తున్నారు. కాస్త ఆలస్యంగా స్పందించిప్పటికీ.. లేటెస్టుగా అడగాల్సినవన్నీ అడిగేశారని చెప్పాలి. జేసీ బ్రదర్ చేత అన్నేసి మాటలు అనిపించుకునే బదులు.. ఏపీ నేతలు తమ గళాన్ని వినిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.