Begin typing your search above and press return to search.
సంచలన ప్రకటన చేసిన జేసీ బ్రదర్!
By: Tupaki Desk | 13 Aug 2018 7:26 AM GMTసంచలన ప్రకటనలు జేసీ ఫ్యామిలీకి బాగా అలవాటు. సంచలనాలు సృష్టించాలన్నా.. వివాదాలు చేయాలన్నా వారి తర్వాతే. తాజాగా అలాంటి పనే చేశారు జేసీ బ్రదర్.. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నా.. రానున్న ఎన్నికల్లో తన బదులు తన కొడుకు అశ్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడనున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తన పట్ల ప్రజలు చూపించే ప్రేమాభిమానాలు తన కొడుకు విషయంలోనూ ప్రదర్శించాలని కోరారు. తనను మించిపోయేలా తన కొడుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా చెప్పిన ఆయన.. తన కొడుకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు చెప్పారు.
సాధారణంగా కొడుకును రాజకీయాల్లోకి దించటం.. ఎన్నికల బరిలోకి నిలపటం కొత్తేం కాకున్నా.. అలాంటి సందర్బాల్లో టికెట్ హామీపై అధినేత చేత కానీ.. పార్టీలో కీలక నేతలతోనో ప్రకటన చేయిస్తుంటారు.
కానీ.. జేసీ రాజ్యంలో అలాంటివేమీ ఉండవని చెప్పాలి. ఎమ్మెల్యేగా టికెట్ అధినేత ఎవరికి ఇవ్వాలన్నది తామే డిసైడ్ చేసేయటం జేసీ ఫ్యామిలీకే దక్కుతుంది.అంతేనా..తన కొడుకు ఫ్యూచర్ ప్లాన్ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన గురించి కూడా ఆసక్తికరమైన ముచ్చట ఒకటి చెప్పారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీ చేయనున్నట్లు చెప్పారు. కౌన్సిలర్ గా స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలన్నదే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. మొదట్నించి ప్రజలే తన బలం.. బలహీనతగా అభివర్ణించే ప్రభాకర్ రెడ్డి.. దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ కూడా.. ఇంకా సమస్యలు ఉన్నాయన్న స్పృహ కానీ.. ఆలోచన కానీ రావు.అధికారం ఏళ్ల తరబడి.. వంశపార్యం పరంగా సాగాలంటే ఇష్యూలు ఉండాలిగా..!