Begin typing your search above and press return to search.
భువనేశ్వరి వివాదంపై జేసీ రియాక్షన్ వైరల్
By: Tupaki Desk | 30 Nov 2021 7:30 AM GMTవాస్తవం ఏమిటో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కళ్ళకు కట్టినట్టు చెప్పారు. భువనేశ్వరి కేంద్రంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న రచ్చపై జేసీ తనదైన స్టైల్లో స్పందించారు. భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించిన ఘటనపై జేసీ స్పందిస్తూ ‘వైసీపీ నేతలు అన్నది భువనేశ్వరిని అయితే తామెందుకు స్పందించాల’న్నట్లుగా జేసీ మాట్లాడారు. భార్యను, తల్లిని దూషించినందుకు ముందు స్పందించాల్సింది చంద్రబాబు నాయుడు, లోకేషే అన్న విషయాన్ని జేసీ పరోక్షంగా గుర్తుచేశారు.
చంద్రబాబు, లోకేష్ సరిగా స్పందించకపోతే తామెందుకు స్పందించాలి, మామూలు జనాలకు ఏమవసరం అని తీవ్రంగానే జేసీ ఎదురు ప్రశ్నించారు. తన భార్యను దూషించినందుకు చంద్రబాబు మీడియా సమావేశంలో ఏడుస్తూ కూర్చుంటే ఏమిటి ఉపయోగం అని నిలదీశారు. నందమూరి కుటుంబ సభ్యులు మీడియా సమావేశం పెట్టి మీసాలు దువ్వితే సరిపోతుందా ? అంటు పరోక్షంగా నందమూరి బాలకృష్ణను ఎద్దేవా చేశారు.
రాయలసీమలో ఇంకెవరినైనా అనుంటే కనీసం ఒక హత్య జరిగుండేదన్నారు. హత్య జరగకపోయినా అంత స్ధాయిలో గొడవ అయ్యుండేదని పరోక్షంగా చంద్రబాబు వైఖరిని దెప్పిపొడిచారు. వైసీపీ నేతలు భువనేశ్వరిని అంతమాట అన్న తర్వాత కూడా నేతలు, జనాల్లో పెద్దగా స్పందక కనబడలేదని జేసీ వివరించారు . ఇందుకు తండ్రి, కొడుకుల వైఖరే కారణమని కూడా పరోక్షంగా తేల్చిచెప్పారు. వైసీపీ ఎంఎల్ఏల మాటలకు తనకే స్పందన రానపుడు ఇక మామూలు జనాలకు ఎలా వస్తుందన్నారు.
నారా-నందమూరి కుటుంబాలకు డబ్బుకు కొదవా ? అనుచరులు, మద్దతుదారులు, అభిమానులకు కొదవా ? వాళ్ళంతా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ముందు స్పందించాల్సిన వాళ్ళు సరైన రీతిలో స్పందించకపోతే మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందిస్తారని లాజిక్ మాట్లాడారు. ఏదేమైనా జేసీ మాటలు ఇఫుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇదే విషయంపై తమ్ముళ్లలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలాగుంటే చంద్రబాబు నుంచి సీనియర్లలో చాలామందికి ఫోన్లు వెళ్ళినా స్పందించిన వాళ్ళు చాలా తక్కువ మందే అని పార్టీ వర్గాలే చెప్పాయి.
ఇంత జరిగిన తర్వాత కూడా వివాదానికి మూల కారణమైన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీపై చంద్రబాబు ఎందుకని యాక్షన్ తీసుకోవటం లేదో అర్ధం కావటంలేదు. వంశీని పార్టీ నుంచి బహిష్కరించటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని తమ్ముళ్ళ ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగకపోవటంతోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు.