Begin typing your search above and press return to search.

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్!

By:  Tupaki Desk   |   8 Jun 2020 4:30 PM GMT
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్!
X
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాపారాల్లో అక్రమాలపై వైఎస్ జగన్ సర్కార్ నజర్ పెట్టింది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి అక్రమంగా తిప్పుతున్న జేసీ ట్రావెల్స్ బస్సులపై కన్నేసి చాలా బస్సులను సీజ్ చేశారు.

తాజాగా జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. జేసీకి చెందిన 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. బీఎస్3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్4గా మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. 60 వాహనాలను రవాణా అధికారులు సీజ్ చేశారు. మిగతా 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అజ్ఞాతంలో దాచిపెట్టారు. వాటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రయాణికుల జీవితాలతో జేసీ ట్రావెల్స్ చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారు. స్క్రాప్ కింద కొన్న బస్సులు, లారీలను రోడ్లపై నడపడం దారుణమన్నారు. జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశామని.. ఫోర్జరీ వ్యవహారంపై నివేదిక అందజేసినట్లు పేర్కొన్నారు.