Begin typing your search above and press return to search.

అజారుద్దీన్ పై వేటుకు రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   28 Jun 2021 12:48 PM GMT
అజారుద్దీన్ పై వేటుకు రంగం సిద్ధం
X
టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్.సీ.ఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పోస్టుకు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. హెచ్.సీ.ఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇటీవల రహస్యంగా జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్ ను హెచ్.సీ.ఏ అధ్యక్ష పదవి నుంచి సాగనంపాలని నిర్ణయించింది.

హెచ్.సీ.ఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశం తాజాగా రహస్యంగా జరిగింది. ఇందులో అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్.సీఏలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలతో అజారుద్దీన్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది అపెక్స్ కౌన్సిల్.

అజార్ పై వచ్చిన ఆరోపణలపై ఈనెల 15న షోకాజ్ నోటీసులు జారీ చేిసంది. కానీ ఈ నోటీసులకు అజార్ సమాధానం ఇవ్వలేదు. తానే అధ్యక్షుడిని అని కోర్టులో కౌంటర్ వేశాడు. వచ్చే నెల 18న జనరల్ బాడీ మీటింగ్ లో అజార్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది అపెక్స్ కౌన్సిల్. దీనిపై ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది.

-హెచ్.సీ.ఏ వివాదం ఇదీ..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ) అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ప్రతిరోజు ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికే హెచ్.సీ.ఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ను తొలగించింది. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ ను అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా చేసింది.దీనిపై అజారుద్దీన్ మండిపడ్డారు. 'నేను ఇప్పటికీ హెచ్.సీ.ఏ అధ్యక్షుడిని అని.. అపెక్స్ కౌన్సిల్ కు తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే హక్కు లేదని ' స్పష్టం చేశారు. హెచ్.సీ.ఏ చరిత్రలో తాత్కాలిక అధ్యక్షుడు లేరు అని అజార్ స్పష్టం చేశారు.

తనను తొలగించి తాత్కాలిక అధ్యక్షుడిని ఎంపిక చేసిన వైనంపై కోర్టును ఆశ్రయించాలని అజారుద్దీన్ ఆలోచిస్తున్నాడు. ''చట్టపరంగా ఎంపికయ్యాను.. సుప్రీంకోర్టు ఆదేశాల మరకు దేశానికి టెస్ట్ క్రికెట్ ఆడిన తాను హెచ్.సీ.ఏ అధ్యక్షుడిగా అర్హుడిని. అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలు చెల్లవు'' అని అజార్ వాదిస్తున్నారు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో.? చూడాలి మరీ.