Begin typing your search above and press return to search.

జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ..

By:  Tupaki Desk   |   18 Feb 2020 12:45 PM GMT
జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ..
X
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ .. ప్రజలకి ఏదైనా చేయాలనే లక్ష్యంతో రాజకీయాలలో అడుగుపెట్టిన అతికొద్దిమంది నేతలలో ఒకరు. ప్రజల నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా అయన ప్రజలకి సేవ చేయాలని అనుకున్నారు. ఏపీలో ఆయనకి మంచి పేరుంది. ప్రస్తుతం సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఈ పేరు మారుమోగిన విషయం తెలిసిందే. అయితే , ఆ తరువాత కొద్దిరోజులకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోని రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజులపాటు దేశ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలపై అవగాహనా పెంచుకోవడానికి పర్యటనలు చేసిన జేడీ ..ఆ తరువాత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి, జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.

గత ఏడాది జరిగిన ఏపీ ఎన్నికలలో జనసేన తరపున విశాఖ పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమిచెందారు. ఆ తరువాత పార్టీ అధినేత తో పలు కార్యక్రమాలలో యాక్టీవ్ గా పాల్గొన్న జేడీ ...ఒక్కసారిగా జనసేన కి రాజీనామా చేస్తునట్టు చెప్పి అందరిని ఆచ్చర్యపరిచారు. సినిమాలు చేయనని చెప్పి, సినిమల్లో నటిస్తున్నారని, పవన్‌లో నిలకడ స్వభావం లేదని విమర్శించి, జనసేనకు రాజీనామా చేశారు. సమాజ సేవకు, రాజకీయమే అత్యుత్తమ వేదిక అని, పదేపదే అంటున్న జేడీ, పాలిటిక్స్‌లో వుంటానని మాత్రం గట్టిగానే చెబుతున్నారు. జనసేన కి రాజీనామా చేసిన తరువాత రాజకీయంగా అంతగా యాక్టీవ్ గా లేరు. కానీ , రాజకీయంగా గ్రౌండ్ వర్క్ చేస్తునట్టు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో అయన బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ , బీజేపీతో ఇప్పుడు జనసేన పొత్తుపెట్టుకుంది. ఈ సమయంలో మళ్లీ బీజేపీలో జేడీ చేరితే జనసేన తో కలిసి నడవాల్సి ఉంటుంది కాబట్టి అయన దాదాపుగా బీజేపీలో కూడా చేరారు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ, అయన అతి త్వరలో ఒక కొత్త పార్టీతో మన ముందుకు రాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జేడీ కొత్త పార్టీకి ఇన్స్పిరేషన్ ..ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ అని తెలుస్తుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా, ఒకప్పుడు జేడీ మాదిరే సివిల్ సర్వెంట్. ఆమ్‌ ఆద్మీ స్థాపించి, హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఆప్‌ విజయఢంకా, జేడీలోనూ ఉత్సాహం నింపిందని, ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. దీనితో కేజ్రీవాల్ తరహాలోనే జేడీ కొత్త పార్టీకే మొగ్గుచూపుతున్నారు. ప్రజలకి మెరుగైన పాలన అందిస్తే ..వారే దీవిస్తారు అని ఆప్ ని చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది. ఢిల్లీ ఈసారి ఎలాగైనా కమలం జెండా ఎగురవేయాలన్న బీజేపీని ఢిల్లీ ప్రజలు తుంగలో తొక్కి క్రేజీకే మరోసారి పట్టం కట్టారు. ఆప్ లాగే జేడీ కూడా కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికలలోపు పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేలా వ్యూహాలు సిద్ధం చేస్తునట్టు సమాచారం. మొత్తంగా ఆప్ ఇచ్చిన నమ్మకం తోనే జేడీ కొత్త పార్టీ పెట్టడానికి సన్నధం అవుతున్నారని అంటున్నారు