Begin typing your search above and press return to search.
జగన్ శత్రువు వైసీపీలో చేరబోతున్నాడా?
By: Tupaki Desk | 24 Jun 2020 5:00 AM GMTఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం సహజమే.. రాజకీయాల్లో అయితే అది ఎప్పుడూ జరుగుతుంటుంది. ఐదేళ్ల పాలన తర్వాత రాజకీయా పార్టీల తలరాతలు మారుతుంటాయి. ప్రతిపక్షంలో ఉండగా ముప్పుతిప్పులు పడ్డ వారు అధికారంలోకి వస్తారు. ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతుంటారు.
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా 10 ఏళ్ల పాటు పోరాడారు. అధికారపక్షాల కుట్రలకు 16 నెలల జైలు జీవితం గడిపారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ప్రముఖ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేశారు. తర్వాత కాలంలో ఆయన జాబ్ కు రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు జనసేన నుంచి వైదొలిగి జేడీ లక్ష్మీనారాయణ ఖాళీగా ఉన్నారు. ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు చుక్కాని లేని నావలా ఉన్నారు.
బీజేపీలో చేరుదామనుకున్న ఆయన తాను వదిలేసిన జనసేన ఆ పార్టీతోనే పొత్తులో ఉండడంతో వెనకడుగు వేశారు. తాజాగా ఆయన అడుగులు వైసీపీ వైపు పడుతున్నట్టు కనిపిస్తోంది. కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన జేడీ తాజాగా సీఎం జగన్ ఏడాది పాలనపై ప్రశంసలు కురిపించడం విశేషం. ఈ క్రమంలోనే జేడీ వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే జగన్ ను జైలుకు పంపిన జేడీ లక్ష్మీనారాయణను జగన్ తీసుకుంటాడా అన్న అనుమానం చాలా మందిలో ఉంది. దీనికి జేడీ కూడా ఆసక్తికరంగా స్పందించాడు. జగన్ పై కేసులు రాజకీయ కక్షతో పెట్టారని.. విధి నిర్వహణలో భాగంగానే తాను ఆ కేసులను విచారణ జరిపానని లక్ష్మీనారాయణ పరోక్షంగా అన్నారు.
అయితే జగన్ ను ఎంత ఇబ్బందిపెట్టినా సరే జేడీ లక్ష్మీనారాయణ వస్తానంటే జగన్ చేర్చుకుంటాడనే వాదన వైసీపీ నుంచి వ్యక్తమవుతోంది. విచారణ జరిపిన జేడీయే చేరితే జగన్ కేసులు కుట్ర అని ప్రజలకు తెలుస్తుందని.. జగన్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ ఆలోచిస్తోంది. మరి ఈ ఇద్దరు కలుస్తారా? ఒక్కటి అవుతారా అన్నది రాజకీయ వర్గాల్లో నెలకొంది.