Begin typing your search above and press return to search.
లక్ష్మీనారాయణ పార్టీ పేరు తెలిసిపోయింది!
By: Tupaki Desk | 24 Nov 2018 5:42 AM GMTసీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరు తెలిసిపోయింది. వందేమాతరం పార్టీ(వీఎంపీ)గా ఆయన తన పార్టీకి నామకరణం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. ఈ నెల 26న ఈ పేరుతో పాటు పార్టీ జెండాను కూడా లక్ష్మీనారాయణ ఆవిష్కరిస్తారు. అదే రోజున తమ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరిస్తారు.
వందేమాతరం పార్టీ సిద్ధాంతాలు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన టార్గెట్ చేసిన యువత - విద్యావంతుల ఓట్లనే వీఎంపీ కూడా టార్గెట్ చేసే అవకాశముంది. అంటే లక్ష్మీనారాయణ పార్టీ రాకతో జనసేనకు కాంపిటీషన్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. వీఎంపీ ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే ఓట్ల చీలిక తప్పదని వారు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ చీలిక పవన్ ను దెబ్బకొట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
ఐపీఎస్ అధికారిగా సీబీఐలో ఉన్నప్పుడు జగన్ అక్రమాస్తులు - గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాస్తులు తదితర కీలక కేసుల్లో వి.వి.లక్ష్మీనారాయణ దర్యాప్తు చేపట్టారు. అనంతరం ముందస్తు పదవీ విరమణ తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించారు. ఆయన బీజేపీలో చేరుతారని కొన్నాళ్లు - పవన్ తో చేతులు కలుపుతారని మరికొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారమంతా ఊహాగానాలేనని తేల్చేసిన లక్ష్మీనారాయణ ఈ నెల 26న తాను నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.