Begin typing your search above and press return to search.
పవన్ ఆశలపై ఆఫీసర్ నీళ్లు !
By: Tupaki Desk | 31 March 2018 7:16 AM GMTపవన్ కళ్యాణ్ తన పరువు పోగొట్టుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. మీరు సరిగ్గానే చదివారు. అతను చాలా సార్లు స్వయంకృతాపారాధం వల్ల విమర్శలు ఎదుర్కొన్నాడు. అతని ఈ లక్షణం వల్లే కత్తి మహేష్ వంటి ఓ సామాన్యుడు కూడా పవన్ కళ్యాణ్ తో ఒక ఆట ఆడుకున్నాడు. పవన్ వ్యవహార శైలి వల్ల అతనికి కలిగే ప్రమాదాలకు తాజా ఉదాహరణ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. కొంతకాలం క్రితం ఆయన తాను పనిచేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి రాజీనామా చేశారు. విధుల నుంచి తనను తప్పించమని కోరాడు. వీఆర్ ఎస్ తీసుకుంటానని ప్రకటించాడు. ఆయన అలా ప్రతిపాదన పెట్టాడో లేదో తెలుగు మీడియా ఆయనను రాజకీయాల్లోకి లాగేసింది. అతను ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నాడు, ఆ పార్టీలో ఈ పార్టీలో చేరుతున్నాడు అని వార్తలు వచ్చేశాయి. అది తెలుగు మీడియా లక్షణం. దానిని ఎవరూ ఏం చేయలేరు. కానీ, ఈ మాట లక్ష్మినారాయణ నోటి నుంచి రాలేదు. అతను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించలేదు. కానీ మీడియా వార్తలను చూసి పవన్ కళ్యాణ్ స్పందించడం తొందరపాటు తనం.
ఒక పార్టీ అధినేత, ఏ రాజకీయ పదవుల్లో లేని ఒక అధికారి గురించి ఆ అధికారి ఏ ప్రయత్నం చేయకుండా ఆయన వస్తే ఆహ్వానిస్తాం అని పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి అనడం అంటే... అది ఒక విచిత్రమైన విషయం. *ఆయన నేను గతంలో ఒక సారి కలిశాం. నాలుగైదు మెసేజ్ లు కూడా పంపించుకున్నాం* పవన్ వ్యాఖ్యానించడం కొందరిని విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే అతను ఏపీ రాజకీయాల రాతలు మారుస్తాడు అని ఆయన అభిమానులు ఫీలవుతున్న సమయంలో ఆయన మాటలు కచ్చితంగా వారికి ఆశ్చర్యం కలిగించేవే. పైగా గతంలో టీడీపీ గురించి జేడీ చేసిన వ్యాఖ్యలు పవన్ దృష్టికి రాలేదేమో గాని జనాలకు తెలుసు. తొందరపడితే పడ్డాడు తర్వాత లక్ష్మీనారాయణ జనసేనలోకి నిజంగా వచ్చే ఏర్పాట్లు చేసుకుని ఉంటే, అది ఇంటర్నల్ గా నిర్దారించుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఆ కథ వేరే ఉండేది. కానీ, లక్ష్మీనారాయణ తాజా స్పందనతో పవన్ కి మొహం కొట్టేసినట్టు అయ్యింది.
ఎందుకంటే జనసేనలో చేరుతున్నట్టు తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. అవన్నీ అవాస్తవాలే అని ఖండించారు. ఆ వార్తలన్నీ కేవలం మీడియా సృష్టించిన కథనాలని కొట్టిపారేశారు. తన రాజీనామా దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెండింగ్ లో పెట్టిందని అందువల్ల ఇప్పటికి ఏమీ మాట్లాడలేను అని అన్నారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.